దేశంలో ఆడవాళ్లపై అత్యాచారాలు హత్యలు పెరిగిపోతున్న క్రమంలో అసెంబ్లీలో మహిళా భద్రత గురించి చర్చ జరిగిన నేపథ్యంలో అసెంబ్లీలో అధికార పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా నగర ఎమ్మెల్యే వైసీపీ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యంత దారుణంగా దేశంలో ఆడవాళ్లను లైంగికంగా వేధింపులకు గురి చేస్తుంటే అనేక కొత్త చట్టాలు తీసుకురావాలని దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు కోరుతుంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆడవాళ్లపై అత్యాచారాలకు హత్యలకు పాల్పడుతున్న వారిపై రెండు బెత్తం దెబ్బలు కొడితే చాలు అన్నట్టు గా మాట్లాడటం దారుణమని మహిళా విషయంలో ఆ విధంగా మాట్లాడకూడదని అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ కి ఎమ్మెల్యే రోజా వార్నింగ్ ఇవ్వటం జరిగింది.

 

మహిళా భద్రత బిల్లు విషయంలో అసెంబ్లీ లో చర్చ జరుగుతున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కొన్నిసార్లు చర్చకు అడ్డు పడి ఉల్లి ధరలపై చర్చ జరపాలని పట్టుపట్టడంతో అసెంబ్లీలో గందరగోళం వాతావరణం నెలకొంది. దీంతో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కలుగజేసుకుని కొన్నిసార్లు తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్పినా గానీ… గోల గోల చేయటం ఆపలేదు. దీంతో అసెంబ్లీ మహిళా భద్రత బిల్లు ఈ విషయంలో అనేక సార్లు అవాంతరాలు సభకు ఎదురయ్యాయి. మరోపక్క వైసీపీ పార్టీకి చెందిన నాయకులు ముందు మహిళా భద్రత బిల్లు విషయం లో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ఉల్లి ధరలపై చర్చలు జరుపుతారని క్లారిటీ ఇచ్చిన గాని తెలుగుదేశం పార్టీ నాయకులు అసెంబ్లీలో సభకు తీవ్ర అంతరాయం కలుగజేశారు.

 

దీంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ కలుగజేసుకుని కచ్చితంగా ఉల్లి ధరల పై చర్చ జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. అయినా గాని తెలుగుదేశం పార్టీ సభ్యులు మహిళా భద్రత బిల్లు విషయంలో చర్చ జరుగుతున్న తరుణంలో సభకు తీవ్ర అంతరాయం కలుగజేయడం తో ఆంధ్రప్రదేశ్ మొట్ట మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. మరోపక్క ఈ గందరగోళ వాతావరణంలోనే వైసీపీ పార్టీకి చెందిన మహిళా ప్రజాప్రతినిధులు మహిళా భద్రత బిల్లు విషయమై చర్చ జరపడం జరిగింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: