'అర్జున్ రెడ్డి' సినిమా తో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమా ఇచ్చిన విజయంతో వరుస ఆఫర్లు దక్కించుకుని విజయ్ దేవరకొండ అతి తక్కువ బడ్జెట్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నటించిన గీత గోవిందం సినిమా భారీ కలెక్షన్లు సాధించడంతో పెద్ద పెద్ద ప్రొడక్షన్ సంస్థలు మరియు భారీ భారీ క్రేజీ స్టార్ డైరెక్టర్లు విజయ్ దేవరకొండ తో సినిమా చేయడానికి అప్పట్లో చాలామంది విజయ్ దేవరకొండ కాల్షీట్స్ కోసం డేట్స్ కోసం క్యూ కట్టారు. ఇటువంటి నేపథ్యంలో విజయ్ దేవరకొండ వరసగా సినిమాలు ఒప్పుకుంటున్న చేస్తున్న సినిమాలు విడుదలవుతున్న అవి ప్రేక్షకులను అభిమానులను ఆశించిన స్థాయిలో అలరించకుండా విడుదలై బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్న తరుణంలో భవిష్యత్తులో చేయబోయే ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తలు ఇప్పటినుండి తీసుకుంటున్నాడు విజయ్ దేవరకొండ.

 

ఇదిలా ఉండగా ప్రతి సినిమాకి వైవిధ్యంగా విజయ్ దేవరకొండ కనిపిస్తు లాంగ్ హెయిర్ తో గుబురు గడ్డంతో యూత్ ని ఎట్రాక్ట్ చేసే విధంగా సరికొత్త ట్రెండ్ ఇటీవల సృష్టిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' అనే సినిమా కోసం తన లుక్ మార్చుకోవడానికి విజయ్ దేవరకొండ రెడీ అవుతున్నట్లు ఈ నేపథ్యంలో ఇప్పుడు గుబురు గడ్డంతో ఉండటంతో పాటుగా లాంగ్ హెయిర్ కలిగిన విజయ్ దేవరకొండ తో ఒక గడ్డం మాత్రమే తొలగించి లాంగ్ హెయిర్ తో విజయ్ దేవరకొండ చేత 'ఫైటర్' సినిమా చేయించడానికి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ లో వార్తలు వినబడుతున్నాయి.

 

మరోపక్క ఫ్యాషన్ నేపథ్యంలో సరికొత్తగా రౌడీ అనే బ్రాండ్ క్రియేట్ చేసి యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్న విజయ్ దేవరకొండ తన రౌడీ అనే బ్రాండ్ ప్రమోట్ చేయడానికి అలాగే తన సినిమాకి సంబంధించిన విశేషాలను తెలియజేయడానికి ఒక సరికొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలని అభిమానులు సోషల్ మీడియాలో కోరుతున్నారు. మరి ఫ్యాన్స్ కోరికను విజయ్ దేవరకొండ తీరుస్తాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: