ఉల్లిపాయ ధర రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్న నేపధ్యంలో ఉల్లిపాయలకు బంగారం కన్నా విలువ పెరిగి పోయింది. ఉల్లి కొరతను ఆధారంగా చేసుకుని అనేక జోక్స్ సెటైర్లతో మీడియా హోరెత్తి పోతోంది. ఈ పరిస్థితులలో ఉల్లిపాయ కొరతను తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు బజార్లు ద్వారా జనానికి కేజీ 25 రూపాయలకు ఇస్తున్న పరిస్థితులలో ఆ రైతు బజార్లకు మహిళల దగ్గర నుండి చిన్న పిల్లలు పురుషుల వరకు క్యూ లైన్స్ లో నుంచుని ఉంటున్న పరిస్థితులలో ఆ క్యూలు కిలోమీటర్ల దూరంలో కనిపిస్తూ సాధారణ ప్రజానీకం ఉల్లి కోసం ఇన్ని పాట్లు పడుతున్నారా అన్న విషయాన్ని అర్ధం అయ్యేలా చేస్తోంది.

ఇలాంటి పరిస్థితులలో ఈ ఉల్లిపాయల కోసం కృష్ణాజిల్లాలోని ఒక రైతు బజార్లో సాంబయ్య అనే మధ్య వయస్సులో ఉన్న వ్యక్తి ఆ క్యూలో నుంచుని గంటల తరబడి వేచి ఉండటంతో అతడు ఆ క్యూలోనే సొమ్మసిల్లి పడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అతడిని ఆ రైతు బజారు నుండి ఆస్పత్రికి తరలించే లోగానే చనిపోయినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ఈ సంఘటన హాట్ న్యూస్ గా మారడంతో పవన్ కళ్యాణ్ ఈ సంఘటన పై కిన్ని ఆ సక్తికర కామేత్స్ చేసాడు. ఇలా ఉల్లిపాయల కోసం సాధారణ ప్రజానీక్కాన్ని గంటల తరబడి క్యూలో నుంచుని ఉండేలా చేసేకన్నా ప్రతి ఇంటికి ఒక కేజీ ఉల్లిపాయలు తీసుకు వెళ్ళి ఇచ్చి ఆ 25 రూపాయలు తీసుకోవచ్చు కదా అంటూ కామెంట్స్ చేసాడు. 

అంతేకాదు ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈమధ్యనే నిమైమ్చిన విలేజ్ వాలంటీర్స్ సహాయం తీసుకోవచ్చు కదా అంటూ ఒక సూచన చేసి దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడ పవన్ మీడియాకు విడుదల చేసాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారడమే కాకుండా పవన్ చెప్పిన సూచనలు బాగున్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఉల్లిపాయ పై జనంకు ఆగ్రహం పెరిగిపోతే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కూడ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన సందర్బాలు గతంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయను చూసి సామాన్య ప్రజలు మాత్రమే కాదు రాజకీయ నాయుకులు కూడ భయపడి పోతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: