ప్రస్తుతం పోర్న్ వీడియోలు చూసే వారికి బిగ్ షాక్ తగిలింది. మన దగ్గర ఫోన్స్, టాబ్స్, నెట్ ఉందికదా అని ఏది పడితే అది చూడొద్దండోయ్ ... అదే పనిగా గంటల కొద్ది అశ్లీల వీడియోలను వీక్షిస్తే, ఇక సైబర్‌ క్రైంకు చిక్కినట్టేనని అంటున్నారు. సైబర్‌ క్రై వారు ఐపీ అడ్రస్‌ల ఆధారంగా వారిని గుర్తించే పనిలో పోలీసులు బిజీ అయ్యారట. వారు హెచ్చరికలను లెక్క చేయకుంటే ఏడేళ్లు జైలు శిక్ష ఖాయమని వారు చెబుతున్నారు. 


ఒకే సమయంలో పోర్న్‌ వీడియోలను వీక్షిస్తున్న మూడు వేల మందిని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. పైగా వారిని  పిలిచి వారికి క్లాస్‌ పీకేందుకు సైబర్‌ క్రైం సిద్ధం అయినట్టు తెలిపారు. ఈ మేరకు ఓ యువకుడికి పోలీసులు వార్నింగ్‌ ఇస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో కలకలం రేపుతోంది. పోర్న్‌ వీడియోలను వీక్షించే వారి సంఖ్య భారత్‌లో అత్యధికంగా ఉన్నట్టు ఓ సర్వే తేల్చి చెప్పింది. ఇష్టారాజ్యంగా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయ్యే ఈ వెబ్‌ సైట్లను అరికట్టడం సైబర్‌ విభాగానికి పెద్ద సమస్యే. 


ఈ వీడియోలకు తగ్గట్టుగానే, ఇటీవల కాలంగా మహిళలు, యువతులు, పిల్లలల మీద లైంగిక దాడులు, ఉన్మాద చర్యలు  పెరిగి ఉన్నాయి. హైదరాబాద్‌లో సాగిన దిశా హత్య ఉదాంతం తదుపరి రాష్ట్ర పోలీసు యంత్రాంగం ముందు జాగ్రత్తల్లో పడింది. మహిళలకు, పిల్లలకు  భద్రత కల్పించే రీతిలో దూకుడు పెంచి ఉన్న పోలీసుల యంత్రాంగం మరో అడుగు ముందుకు వేసింది. అశ్లీల వీడియోలను అదే పనిగా గంటల కొద్ది వీక్షించే వారి భరతం పట్టే రీతిలో పోలీసులు కొరడా ఝుళిపించేందుకు సిద్ధం అయ్యారు. వెబ్‌ సైట్లలో అశ్లీల వీడియోలను వీక్షించే వారిని గుర్తించే పనిలో సైబర్‌ క్రైం విభాగంలో ప్రత్యేక  బృందం రంగంలోకి దిగి ఉన్నది. 


పోలీసు యంత్రాంగం తీసుకుంటున్న చర్యలతో తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూరు నగరాలు మహిళలు, పిల్లల సురక్షిత ప్రాంతాలుగా ఉన్నట్టు సర్వేలో తేలింది. ఈ నగరాల్లో హత్యలు, ఆస్తుల వివాదాలు, మోసాలు వంటి నేరాలు సాగినా, ఇతర రాష్ట్రాల్లోని నగరాలతో పోల్చితే, మహిళలు, పిల్లల మీద దాడుల కేసులు తక్కువేనని ఆ సర్వేలో తేలింది. మహిళలు, పిల్లలకు భద్రత కల్పించే రీతిలో ఇక్కడి పోలీసు యంత్రాంగం తీసుకుంటున్న చర్యలతో ఈ రెండు నగరాలను ఆ సర్వే మేరకు సురక్షిత నగరాలుగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: