టాప్ హీరోల సినిమాల ప్రమోషన్ కు సంబంధించి కొత్తకొత్త ఆలోచనలు అనుసరిస్తూ తమ సినిమాలకు క్రేజ్ పెంచుకోవడానికి మన టాప్ హీరోలు అనేక వ్యూహాలను అనుసరిస్తున్నారు. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ మూవీకి సంబంధించిన షార్ట్ వీడియోలు లిరికల్ వీడియోస్ తో జనం మధ్యకు వస్తూ ఉంటే ‘వెంకీ మామ’ ఏకంగా జనం మధ్యకు వెళ్లిపోయి అనేక ప్రదేశాలలో తమ మూవీ ప్రమోషన్ ను బాలీవుడ్ ప్రమోషన్ స్టైల్ లో నిర్వహిస్తున్నారు.

ఇప్పుడు మహేష్ మరొక అడుగు ముందుకు వేసి ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్ ను యూట్యూబ్ లో అప్పుడే మొదలు పెట్టేసాడు.  పాపులర్ యూట్యూబ్ ఛానల్ గా ఇప్పటకే పేరు తెచ్చుకున్న ‘మై విలేజ్’ షోలో మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ కోసం ప్రత్యేక ఇంటర్వ్యూను ఇచ్చాడు. 

ఇప్పటికే సమంత ‘మై విలేజ్’ షోలో జనం విపరీతంగా చూస్తున్న ‘గంగవ్వ’ షోకు సమంత ఇచ్చిన ఇంటర్వ్యూ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఇలా యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చే పద్ధతిని రామ్ చరణ్ క్రియేట్ చేసాడు. ‘ఛాయ్ బిస్కెట్’ యూట్యూబ్ ఛానల్ తో మమేకమై చరణ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ విపరీతంగా పాపులర్ కావడంతో ఇప్పుడు మహేష్ కూడ చరణ్ మార్గాన్ని తన ‘సరిలేరు నీకెవ్వరు’ కోసం అనుసరిస్తున్నాడు.

ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు తమ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ ను యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చేస్తూ బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గర అవుతున్నారు. ఈ మారుతున్న ట్రెండ్ ను పసిగట్టిన మహేష్ ఇప్పుడు ఇలా ‘మై విలేజ్’ ఛానల్ తో అనుసంధానం అవుతూ ‘సరిలేరు నీకెవ్వరు’ మ్యానియాను పెంచడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా ఈరోజు ఉదయం రెండవ సోమవారం కావడంతో ఈ సినిమాలో మహేష్ క్యూట్ లుక్ కు సంబంధించిన మరొక ఫోటోను వదిలి సోషల్ మీడియాలో ఆ ఫోటో వైరల్ అయ్యేలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: