స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా అల వైకుంఠపురములో.. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో బన్ని సరసన హాట్ బ్యూటీ పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో టబు, జయరాం వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు.

 

నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ ఏరి కోరి చేసిన సినిమా ఇది. 2020 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుంది. జనవరి 12న రిలీజ్ అవుతున్న అల వైకుంఠపురములో సినిమా మెగా ఫ్యాన్స్ కు డబుల్ ఫెస్టివల్ అందించేలా ఉంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని 3 సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈ సినిమా టీజర్ డిసెంబర్ 11 బుధవారం రిలీజ్ చేయనున్నారు.

 

టీజర్ గ్లిమ్ప్స్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ చేశారు. బన్ని స్టైలిష్ లుక్ తో అంతే స్టైల్ గా నడుచుకుంటూ వచ్చాడు. మీటింగ్ లో బన్ని రాకకోసం అందరు వెయిట్ చేస్తుంటే స్టైల్ గా టేబుల్ మీద ఎక్కి మరి వచ్చాడు అల్లు అర్జున్. చూస్తుంటే అల వైకుంఠపురములో కచ్చితంగా అంచనాలను అందుకునేలా ఉంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి ఇదివరకు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు చేశారు.

 

ఆ రెండు సినిమాలు హిట్ అవడంతో ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ఒకప్పటి క్లాసిక్ మూవీ ఇంటి గుట్టుకి కాపీ అంటున్నారు. అయితే ఈ విషయంపై మాత్రం చిత్రయూనిట్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు. అల్లు అర్జున్, పూజా హేగ్దేల రొమాన్స్ కూడా సినిమాలో హైలెట్ అవుతుందని తెలుస్తుంది. ఇక తమన్ మ్యూజిక్ ఇప్పటికే సూపర్ హిట్ అనిపించగా సినిమాలో సాంగ్స్ విజువల్స్ అడిరిపోతాయని తెలుస్తుంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: