విలక్షణ నటుడు... పవర్ ఫుల్ విలన్... ఒకప్పటి సాఫ్ట్ హీరో... నేను చెప్పేది ఎవరు గురించి అనుకుంటున్నారా...  ప్రస్తుతం నటనలో తనదైన సత్తా చాటుతూ దూసుకుపోతున్న నటుడు జగపతి బాబు గురించి. అప్పట్లో హీరోగా మంచి విజయాలను అందుకున్న జగపతి బాబు ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. కానీ బాలకృష్ణ సినిమాలో  విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చారు జగపతిబాబు. ఇక అక్కడి నుంచి ఆయన అదృష్టం ఆయన టాలెంట్ తో  ఆయనను ఎక్కడకో తీసుకెళ్ళాయి. వరుస అవకాశాలను చేజిక్కించుకుంటు  అసలుసిసలైన విలన్ అంటే ఎలా ఉంటాడో  తన పవార్ ఫుల్  నటనతో ప్రేక్షకులందరికీ చూపిస్తూ సత్తా చాటుతున్నాడు జగపతిబాబు. 

 


 పాత్ర ఎలాంటిదైనా అందులో ఒదిగిపోయి నటిస్తున్నాడు జగపతి బాబు. అసలు జగపతి బాబు విలన్ పాత్రలో మెప్పించగలడా  అనుకున్నవాళ్లే ఇప్పుడు విలన్ పాత్రలో జగపతి బాబు తప్ప ఇంకెవరు సూట్ కారు అనేంతగా  ప్రభావితం చేసాడు ఆయన. ప్రస్తుతం ఏ సినిమాలో చూసినా విలన్ గా జగపతిబాబు కనిపిస్తున్నారు. విలక్షణమైన నటనతో విలన్ పాత్రలను కొత్త పుంతలు తొక్కించారు జగపతిబాబు. అయితే జగపతిబాబు విలన్గా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పటికే రెండు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో వచ్చిన నాన్నకు ప్రేమతో తాజాగా వచ్చిన అరవింద సమేత రెండు సినిమాలు భారీ విజయాన్ని నమోదు చేశాయి. 

 


 అయితే ఈ రెండు సినిమాల్లో  జగపతిబాబు తన నటనతో విలన్ గా అందరిని మెప్పించాడు. అయితే నాన్నకు ప్రేమతో సినిమాలో  స్టైలిష్ విలన్ గా జగపతిబాబు కనిపించారు. హీరోయిన్ తండ్రి పాత్రలో జగపతిబాబు ఈ సినిమాలో నటించారు. సాఫ్ట్ విలనిజం ఎలా ఉంటుందో  ఈ సినిమాలో నిరూపించారు జగపతిబాబు. అయితే ఈ సినిమాలో జగపతి బాబు నటన కి ప్రశంసలు కూడా దక్కాయి. ఇదిలా ఉంటే నాన్నకు ప్రేమతో సినిమా లో మొదట విలన్ పాత్రలో జగపతిబాబు అనుకోలేదట. ఈ పాత్రలో నటించడానికి ముందుగా తమిళ నటుడు అరవింద స్వామి ని సంప్రదించారట. కానీ అప్పటికే అరవిందస్వామి వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో... తెలుగులో అప్పటికే విలన్ పాత్రలో దూసుకుపోతున్న జగపతిబాబు దగ్గరికి ఈ అవకాశం వచ్చిందట. ఇంకా ఈ పాత్రకు జగపతిబాబు 100% న్యాయం చేశారని సినిమా బృందం భావించిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: