మెగాస్టార్ చిరంజీవి అత్యధిక మార్కెట్ కలిగిన ఏరియా నైజాం. ఒక్క మెగాస్టార్ చిరంజీవి సినిమాలకే కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా నైజాం ఏరియాలో మంచి మార్కెట్ ఉంది. మెగా హీరోల తర్వాత మహేష్ బాబు కి తర్వాత ప్రభాస్ కి అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ కి నైజాం ఏరియాలో కలెక్షన్లు రాబట్టడం విషయంలో ఎవరికి వారికి తమకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మెగా అభిమానుల ఫ్యాన్స్ అధ్యక్షుడిగా కాలం పనిచేసిన నూర్ మహమ్మద్ మెగా ఫ్యామిలీ హీరోలందరికీ బాగా సుపరిచితుడు. ముఖ్యంగా చిరంజీవి సినిమా విడుదల అవుతుందంటే హైదరాబాదులో పండుగ వాతావరణం తీసుకువచ్చే విధంగా అభిమానులతో దగ్గరుండి సినిమా హాల్ దగ్గర కటౌట్లు కట్టించడం విషయం అప్పట్లో బ్యానర్లు పెట్టించడం విషయంలో నూర్ మహమ్మద్ సందడి సందడి వాతావరణం క్రియేట్ చేసే వాళ్ళు.

 

దీంతో మెగా కుటుంబంతో అమితమైన అనుబంధాన్ని క్రియేట్ చేసుకుని మెగా కుటుంబానికి చెందిన సినిమాలు విడుదల సమయంలో అన్నీ దగ్గరుండి తానే చూసుకునే వాడు. అంతేకాకుండా సినిమా ఆడియో ఫంక్షన్లో విషయంలో కూడా నూర్ మహమ్మద్ పాల్గొనేవాళ్ళు . అటువంటి అభిమాని గత ఆదివారం చనిపోవడంతో మెగాస్టార్ చిరంజీవి మరియు అల్లు అర్జున్ అదేవిధంగా రామ్ చరణ్ తీవ్ర మనస్థాపానికి గురి కావడం జరిగింది. అంతేకాకుండా రాంచరణ్, చిరంజీవి, అల్లు అర్జున్ నూర్ మహమ్మద్ కుటుంబ సభ్యులని పరామర్శించారు.

 

పెద్ద దిక్కుని కోల్పోవడంతో నూర్ మహమ్మద్ కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది. దీనితో మెగా పవర్ స్టార్ రాంచరణ్ అతడి కుటుంబ సభ్యులని ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇండస్ట్రీలో ఏ హీరో అభిమానులకు చేయని పని...ఈ సందర్భంగా చనిపోయిన మెగా అభిమాని కి రామ్ చరణ్ చేశాడు, విషయంలోకి వెళితే రాంచరణ్ నూర్ మహమ్మద్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాడు. తమ ఫ్యామిలీపై ఇంతటి అభిమానాన్ని ప్రదర్శించిన నూర్ మహమ్మద్ కుటుంబ సభ్యులని ఆదుకోవాలనే ఉద్దేశంతో రాంచరణ్ ఈ ఆర్థిక సాయం ప్రకటించినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: