తేజ దర్శకత్వంలో 'లక్ష్మీ కల్యాణం' సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ మొట్టమొదటి సినిమాతోనే అదిరిపోయే హిట్ అందుకుంది. ఆ తరువాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'మగధీర' సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న తర్వాత సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి సౌత్ ఇండస్ట్రీ లో ఉన్న చాలామంది స్టార్ హీరోలు అందరికీ పక్కన నటించి తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ పై కన్ను వేసి అక్కడ కొన్ని అవకాశాలు దక్కించుకొని సెటిలై పోదాం బాలీవుడ్లో అని అనుకున్న తరుణం లో చేసిన సినిమాలు మొత్తం బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో తిరిగి సౌత్ వైపు తనకు లైఫ్ ఇచ్చిన దక్షిణాది ప్రేక్షకులను అలరించడానికి యూటర్న్ తీసుకుని ప్రస్తుతం సౌత్ లో అనేక భారీ ప్రాజెక్టు సినిమాలలో అవకాశాలు రాబట్టుకుంటూ దూసుకుపోతుంది.

 

ఇటువంటి నేపథ్యంలో కాజల్ అగర్వాల్ వయస్సు 30 సంవత్సరాలకు పైగానే ఉండటంతో అమ్మడు పెళ్లిపై రకరకాల వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో గట్టిగా వినపడటం జరిగాయి. ఇటువంటి తరుణంలో కొన్ని ఇంటర్వ్యూలలో కాజల్ అగర్వాల్ పై వచ్చిన వార్తలను ప్రేమ వార్తలను పెళ్లి వార్తలను ప్రస్తావించిన సందర్భంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో త్వరలోనే తన పెళ్లి గురించి ఒక వార్త బయటకు వస్తుందని ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తితో మాత్రం పెళ్లి కాదని చిత్ర పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు కాజల్ అప్పట్లో తెలిపింది.

 

అప్పటి నుంచి కాజల్ పెళ్లిపై ఎనక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాజల్ ఎవరైనా అజ్ఞాత వ్యక్తితో ప్రేమలో ఉందా అనే రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో వివాహం చేసుకుంటానని, ప్రస్తుతానికి తాను సింగిల్ గానే ఉన్నానని కాజల్ క్లారిటీ ఇస్తోంది. ఇటీవల కాజల్ అగర్వాల్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ పిక్ అనేక రూమర్లకు బలాన్నిచ్చే విధంగా ఉంది. రెండుచేతులతో లవ్ సింబల్ తరహాలో బీచ్ ఒడ్డున కాజల్ అగర్వాల్ దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: