వివాదాస్పద దర్శకుడు వర్మ తెరకెక్కించిన చిత్రం కమ్మరాజ్యంలో కడప రెడ్లు ఈ చిత్రం మొత్తం టీడీపీ కి వ్యతిరేకంగా ఈ సినిమాలో చూపించారు. దానితో చిరెత్తుకొచ్చిన టీడీపీ నేతలు వ్యతిరేకంగా ఈ సినిమాను విడుదలకు అడ్డుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో 29 నవంబర్ విడుదల అకావలసిన ఈ సినిమా ఇప్పటికి విడుదలకి నోచుకోలేదు. సినిమాలో సన్నివేశాలు కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఉందని చాలా మంది కోర్టు మెట్లెక్కారు. ఆ సందర్బంగా సినిమా పేరును కూడా మార్చాలని అనడంతో ఈ సినిమా పేరు మార్చుకుంది. 

అమ్మరాజ్యంలో కడప బిడ్డలు పేరుతో చిత్రం టైటిల్ మార్చిన కూడా ఈ చిత్రం విడుదలకు సెన్సార్ నో చెప్పింది. ఇది ఇలా ఉండగా ‘చంద్రబాబు నాయుడు అంటే నాకు చాలా ఇష్టం.. ఆయన్ని టార్గెట్ చేసే ఉద్దేశం నాకు లేదు’’ అంటూనే బాబును ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడేసుకుంటున్నారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన తెరకెక్కించిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా ద్వారా చంద్రబాబును.. ఆయన తనయుడు నారా లోకేష్‌ను బాగా వాడేస్తున్నారు వర్మ. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో చూపించింది ఇదే. తాజాగా బాబును టార్గెట్ చేస్తూ ఒక పాటను విడుదల చేశారు.

 


ఈ గొప్ప పాటను వేరే ఎవరితోనైనా పాడిస్తే న్యాయం జరగదని అనుకున్నారేమో వర్మ.. ఆయనే గాయకుడి అవతారం ఎత్తారు. సిరాశ్రీ రాసిన సాహిత్యాన్ని కసిగా పాడేశారు. రవిశంకర్ ఈ పాటను స్వరపరిచారు. పాటలో ఒక వర్గాన్ని అలరించే కంటెంట్ ఉంది కానీ.. రికార్డింగ్ మాత్రం పరమ చెత్తగా ఉంది. దీనికి వర్మ గాత్రం చిరాకు తెప్పిస్తుంది. అయినా ఎంజాయ్ చేసేస్తున్నారు జనం. వర్మా.. నీకు దండం సామి అంటున్నారు.

 

వివాదపు సన్నీ వీసాలతో తెరకెక్కిన ఈ చిత్రం విడుదల కాదు కదా కనీసం కనపడు అనుకున్న వారంతా నోర్లు వెళ్ళబెట్టుకొనేలా ఈ సినిమా డిసెంబర్ 12 న విడుదల కానుంది. సెన్సార్ బోర్డు సూచనల మేరకు ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ను.. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’గా మార్చారు. అలాగే, కొన్ని వివాదాస్పద సన్నివేశాలను తొలగించారు. మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఎన్ని వివాదాలు తలెత్తుతాయి అన్నది చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: