యూత్ లో  ఒక రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్న కథానాయిక రష్మిక మందన్న . తన అందం అభినయంతో ఎంతోమంది కుర్రకారు మతి పోగొట్టింది ఈ అమ్మడు . ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే గ్లామర్ పాత్రలు చేస్తేనే ఎక్కువగా ఫాలోయింగ్ పెరుగుతుంది అనుకుంటున్న వాళ్లకు... ఎలాంటి గ్లామర్ రోల్స్ చేయకుండానే ఎలాంటి అందాల ఆరబోత చేయకుండానే ఒక రేంజ్ లో ఫేమస్ అయిపోయింది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో చలో సినిమా తో నాగశౌర్య తో జోడీ కట్టి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు... ప్రస్తుతం ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన ఛాన్స్ కొట్టేసింది. టాలీవుడ్ లో  రష్మిక విజయ్ దేవరకొండ జోడి కి విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. 

 

వరుస  అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం తన కెరీర్ లో దూసుకుపోతుంది ఈ అందాల ముద్దుగుమ్మ .వచ్చిన  అవకాశాన్ని కరెక్టుగా సద్వినియోగం చేసుకుంటూ ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుకుంది ఈ భామ . అయితే  రష్మీకకి  హిందీ జెర్సీ  రీమేక్ లో ఛాన్స్ వచ్చిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రష్మిక అడిగినంత పారితోషికం ఇవ్వకపోవడంతోనే సినిమాకి నో చెప్పిందని ఊహాగానాలు కూడా వచ్చాయి . దీంతో డబ్బుకి ప్రాధాన్యం ఇస్తూ మంచి పాత్రను వదులుకున్నది  రష్మిక పై విమర్శలు కూడా మొదలయ్యాయి. తనపై వస్తున్న వార్తలపై తాజాగా రష్మికా స్పందించింది. 

 


 తనకు  హిందీ జెర్సీ  రీమేక్ లో  హీరోయిన్ గా నటించేందుకు అవకాశం వచ్చిన మాట నిజమేనని ఈ అమ్మడు క్లారిటీ ఇచ్చింది. అయితే అంతటి బరువైన పాత్ర కి తాను న్యాయం చేయలేనేమో అన్న ఉద్దేశంతోనే ఆ పాత్రను తాను  అంగీకరించలేదు అంటూ చెప్పుకొచ్చింది. అంతే కానీ ఆ సినిమాను వదులుకోవడానికి పారితోషకం కారణం కాదని.. రెమ్యూనరేషన్ గురించి ఆ సినిమాను వదులుకున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపింది. మంచి పాత్రలను  పారితోషికంతో తానెప్పుడూ ముడిపెట్టను  అంటూ ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. ఏదేమైనా హిందీ జెర్సీ  రీమేక్ లో రష్మిక నటించి ఉంటే బాగుండేది అని అభిమానులు కూడా భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: