బాలకృష్ణ బోయపాటి సినిమా అంటే ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. వీరిద్దరిది  క్రేజీ కాంబినేషన్ అని చెప్పాలి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో  నగరి ఎమ్మెల్యే నటి రోజా ఓ పాత్రలో నటించపోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటివరకు ఎవరూ క్లారిటీ కూడా ఇవ్వలేదు. పార్టీల పరంగా చూసుకుంటే బాలకృష్ణ రోజాలు ఇద్దరు ప్రత్యర్థులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రోజా బాలక్రిష్ణ సినిమాలో చేస్తుందా లేదా అన్న   ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే దీనిపై ప్రస్తుతం ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చినట్లు పలువురు భావిస్తున్నారు. 

 

 నేటి నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.మొదటి రోజే  అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. అసెంబ్లీలో మహిళల భద్రత గురించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన అనంతరం నగిరి ఎమ్మెల్యే రోజా కూడా మహిళల భద్రత గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ పై కూడా పలు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రోజా. గతంలో మహిళలపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు  ప్రస్తావనకు వస్తాయేమో అని టిడిపి ప్రస్తుతం భయపడుతుందని అని మండిపడ్డారు. గతంలో బాలకృష్ణ మహిళలపై కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ రోజా అసెంబ్లీ వేదికగా ఆరోపించారు. 

 


 అయితే రోజా అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో రోజా రీ  ఎంట్రీ తో ముఖ్య పాత్రలో నటించబోతోంది అంటూ వస్తున్న వార్తలు నిజం కాదని అర్థమవుతుంది. దీంతో చాలామంది రోజా బాలకృష్ణ సినిమాలు నటించను అన్న విషయాన్ని  అసెంబ్లీ వేదికగా నే క్లారిటీ  ఇచ్చిందని అందరూ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే అటు రోజా అభిమానులు మాత్రం బాలకృష్ణ సినిమాలో కాకపోయినా వేరే హీరో సినిమాలో ఆయన రోజా సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చే సినిమాల్లో కూడా తమను అలరించాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: