నందమూరి నటసింహం బాలకృష్ట 106వ ప్రాజెక్టు ఇటివలే శ్రీకారం చుట్టారు. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శీను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎప్పటినుంచో ఈ సినిమాపై వార్తలు వస్తున్నా ఇప్పటికి కొబ్బరికాయ కొట్టారు. బాలయ్యబోయపాటి కాంబోలో గత రెండు సినిమాలు.. సింహ, లెజెండ్ ఒకదానిమించి మరొకటి సూపర్ హిట్లుగా నిలిచాయి. దీంతో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమాపై ఇప్పుడు ఓ వార్త ఫిల్మ్ నగర్ లో రౌండ్ అవుతోంది. 

 

 

బాలయ్యబోయపాటి రెమ్యునరేషన్ల గురించే ఆ వార్త. ఇప్పటి వరకూ బాలయ్య హయ్యస్ట్ రెమ్యునరేషన్ 8కోట్ల వరకూ ఉందని సమాచారం. రూలర్ కు బాలయ్య 12కోట్లు వరకూ అడిగినా 10కోట్లకు సెటిల్ అయినట్టు తెలుస్తోంది. ఇదే ఫిగర్ ను ఇప్పుడు బోయపాటి సినిమాకు కూడా తీసుకుంటున్నాడట. అక్కడ వరకూ బాగానే ఉన్నా బోయపాటి రెమ్యునరేషన్ గురించే నమ్మబుద్ది కాని ఫిగర్ చెప్తున్నారు. బోయపాటిసినిమా కోసం ఏకంగా 15కోట్లు తీసుకుంటున్నాడని అంటున్నారు. నిజానికి బోయపాటికి ఎంత క్రేజ్ ఉన్నా వినయ విధేయ రామతో మొత్తం ఆయనపై నమ్మకం అంతా పోయింది. ఇలాంటి సమయంలో బోయపాటికి అంతిస్తున్నారా అనే సందేహం వస్తోంది. 

 

 

అయితే.. బాలయ్యతో ఉన్న ట్రాక్ రికార్డు దృష్ట్యా ఈ ఫిగర్ నిజమేనంటున్నాయి ఫిల్మ్ నగర్ సర్కిల్స్. బాలయ్య బాడీ లాంగ్వేజ్ బాగా తెలిసిన దర్శకుల్లో బోయపాటి ఒకడు. ఈ సినిమా బడ్జెట్ కూడా 70కోట్లకు లాక్ అయిందనే టాక్ ఉంది. కానీ బాలయ్య మార్కెట్ కు డబ్బై కోట్లు రికవరీ అంటే కాస్త ఆలోచించాల్సిందే అంటున్నారు. కానీ.. సెంటిమెంట్ వర్కౌట్ అయితే బాలయ్యకి తగ్గట్టు కథా కథనాలు ఇస్తే రికవరీ సాధ్యమేనంటున్నారు. చూద్దాం.. ఈసారి వీరిద్దరూ ఏం మ్యాజిక్ చేస్తారో.

మరింత సమాచారం తెలుసుకోండి: