స్టార్ హీరోల ఏజ్ గేజ్ పై మీడియాలో ఇంతకముందెప్పుడు లేనివిధంగాగా కామెంట్లు పడుతున్నాయి. వయసు అయిపోయినా ఇంకా జనాలపై రుద్దేస్తున్నారన్న కామెంట్లు ఇప్పుడు అన్ని చోట్లా హాట్ టాపిక్ అవుతున్నాయి. లేటు వయసులోనూ స్పైక్స్ దువ్వుతూ ఏమిటీ కామెడీ వేషాలు అంటూ ఘాటుగానే విమర్శిస్తున్నారు. తమిళంలో జుట్టు పండిపోయిన తళా తన ఒరిజినాలిటీని చెక్కు చెదరకుండా చూపిస్తూనే తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ పాత్రల్ని ఎంచుకుని సక్సెస్ అందుకుంటున్నాడు. యాప్ట్ క్యారెక్టర్ల తో తళా తెల్ల జుట్టునే ట్రెండీగా ప్రయోగించాడు. అదే కోలీవుడ్ టాలీవుడ్ జనాలు చూడాటానికి విపరీతమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. 

 

అయితే మన హీరోలు మాత్రం ఇంకా నవమన్మధ వేషాలు వేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వయసుడిగిన హీరోలు డిగ్నిఫైడ్ పాత్రల్లో నటించాలన్న కామెంట్ల తో నెటిజనులు బోలెడంత కామెడీలు చేస్తున్నారు. అదంతా సరే కానీ.. నేచురల్ స్టార్ నానీ ఈ కొత్తగా ఒక విషయంలో తీవ్రంగా బెంగ పడుతున్నారట. అతడు సోషల్ మీడియాలో ఓ ఫోటోని పోస్ట్ చేసి తెల్ల జుట్టు వచ్చేస్తోందిరోయ్.. అంటూ టెన్షన్ పడ్డాడు. మరి వయసు మీదపడుతున్నప్పుడు ఇవన్ని సహజమే కదా నేచురల్ స్టార్..!

 

అయితే ఈ ఫోటో చూశాక.. నాని పని అప్పుడే అయిపోయిందా..! అంటూ కొంతమంది ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్  చేస్తున్నారు. అయనా తెల్ల జుట్టు వచ్చేస్తే తళా అవ్వాలి కానీ.. ఇలా కళ్లు తేలేస్తే ఎలా నానీ? అని కొందరు సూచిస్తున్నారు. తెల్ల జుట్టుతోనూ బోలెడంత మ్యాజిక్ చేయొచ్చని నిరూపించిన చాలా మంది స్టార్ హీరోలని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి..అంటున్నారు. జెర్సీ .. గ్యాంగ్ లీడర్ సినిమాతో ఆశించిన సక్సస్ దక్కలేదు. ఇక కొత్త సంవత్సరం లో అడుగు పెట్టేస్తున్నాడు. 2020లో నానీ నటిస్తున్న పలు క్రేజీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇంద్రగంటి వీలో నాని నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటే నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ తో 'టక్ జగదీశ్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం నాని కోరమీసంతో పాటు.. గుబురుగడ్డం పెంచుతున్నాడట. మెలితిరిగిన మీసం తో తళానే తలపిస్తాడట. అయితే తలలో ఓ వెంట్రుక పండితేనే కంగారు పడుతున్న నానీ మొత్తం పండితే ఇంకెంత టెన్షన్ పడతాడో.  

మరింత సమాచారం తెలుసుకోండి: