యంగ్ హీరో విజయ్ దేవరకొండకు యూత్ లో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఆ క్రేజ్ కు తగ్గట్టే ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకు సాగిపోతున్నాడు. ఈ మధ్య డియర్ కామ్రెడ్ ఘోరంగా నిరాశపరచినా విజయ్ కి క్రేజ్ మాత్రం అసలు తగ్గలేదు. ఇక విజయ్ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని క్రియోటివ్ కమర్షియల్ బ్యానర్ పై క్.వల్లభ నిర్మిస్తుండగా..కె.ఎస్.రామారావు సమర్పిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 'ఫైటర్' సినిమాను లైన్లో పెట్టాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తోంది.

 

ఇదిలా ఉంటే విజయ్ నెక్స్ట్ సినిమా గురించి ఫిలిం నగర్లో ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. విజయ్ తన నెక్స్ట్ సినిమాలో తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి నటిస్తాడని లేటెస్ట్ న్యూస్.  అయితే ఇది పూరి సినిమా 'ఫైటర్' లోనా లేక మరో సినిమాలోనా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఆనంద్ దేవరకొండ 'దొరసాని' సినిమాతో హీరోగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫలితం నిరాశపరిచింది. ఆనంద్ నటిస్తున్న రెండవ సినిమా షూటింగ్ పెద్దగా హడావుడి లేకుండా సాగుతోంది. అయితే విజయ్ తన తమ్ముడి కెరీర్ కు బూస్ట్ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నాడట. అందుకే ఇద్దరూ కలిసి నటించే ప్రపోజల్ ఉందని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు.

 

మరి ఈ సినిమాలో ఇద్దరూ ఫుల్ లెంగ్త్ హీరోలుగా నటిస్తారా లేక విజయ్ జస్ట్ అతిథి పాత్రలో నటిస్తాడా అనేది మాత్రం ఇంకా తెలియదు. అసలు ఇదంతా ఉత్తుత్తి ప్రచారమేనా లేక దేవరకొండ బ్రదర్స్ నిజంగానే కలిసి నటిస్తున్నారా అనేది కూడా త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఇక విజయ్ సొంత నిర్మాణ సంస్థలో తరుణ్ భాస్కర్ నటించిన మీకు మాత్రమే చెప్తా ఫ్లాప్ సినిమాగా మిగిలింది. కానీ ప్రేక్షకుల నుంచి మాత్రం మంచి స్పందన లభించింది. విజయ్ తన సొంత సంస్థలో కంటిన్యూస్ గా సినిమాలు నిర్మించాలనే ప్లాన్ లో ఉన్నాడని తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: