బాలీవుడ్ బ్యూటి ఫుల్ హీరోయిన్ అలియాభట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందానికి అందం.. అంతకు మించిన అభియంతో పాటు.. సామాజిక అంశాల మీదా..ఇతర విషయాల మీద తన అభిప్రాయాల్ని నిక్కచ్చిగా చెప్పే ఈ తరం ట్రెండీ హీరోయిన్ గా ఆలియాకు మంచి పేరుంది. తండ్రి కమ్ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కమ్ దర్శకుడు మహేశ్ భట్ సినీ వారసత్వంగా ఆలియా వెండితెరకు పరిచయమైనా.. అతితక్కువకాలంలోనే తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవటంలో సక్సెస్ అయ్యారు. అంతేకాది వరుసగా బాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలతో నటిస్తూ క్షణం తీరిక లేకుండా ఉంది. 

 

ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన ఆలియా మొదటిసారి తెలుగులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో కలిసి నటిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తండ్రి మహేశ్ భట్ తో పాటు ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయింది ఆలియా. మహేశ్ మరో కుమార్తె షాహిన్ భట్ తనకు జరిగిన మెంటల్ ఇల్ నెస్ మీద ఒక పుస్తకాన్ని రాసింది. దీన్ని లాంఛ్ చేసే కార్యక్రమానికి హాజరైన మహేశ్.. మీడియా అడిగిన ప్రశ్నలకు సహనం కోల్పోయారు. మీడియా వాళ్ళ మీద పెద్దగా అరిచేశారు. దీన్నేమాత్రం ఊహించని అలియా తండ్రి పనికి అవాక్కు అయ్యారు.

 

తండ్రి అరుస్తున్న సమయంలో.. అలియా ఆయన్ను వారించే ప్రయత్నం చేస్తూ.. శాంతించాలంటూ సైగలు చేసినా మహేశ్ మాత్రం పట్టించుకోలేదు. దీంతో.. ఆమె కొద్దిపాటి ఇబ్బందికి గురయ్యారు. తండ్రి తీరుతో అన్ కంఫర్ట్ బుల్ గా మారిన ఆలికు చెందిన చిఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంత సెలబ్రిటీస్ అయితే మాత్రం ఆమాత్రం సెల్ఫ్ కంట్రోల్ ఉండదా అంటూ చాలా మంది ఈ సంఘటన చూసి విస్తు పోతున్నారు. అంతేకాదు వయసైపోయిన కారణంగా జనాల మధ్యలో ఎలా ప్రవర్తించాలో తెలీడం లేదని ఒకటే కామెంట్స్ వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: