ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కాస్ట్ కటింగ్ అనేది లేదనే చెప్పాలి. కథ సాదాసీదాగా ఉన్నా దాన్నీ కోసం భారీ బడ్జెట్ ని కేటాయించడం, మధ్యలో కొన్ని అనవసర ఖర్చులు పెట్టడం. ఇదంతా కలిసి తడిసి మోపెడు అవుతుంది. ఇచ్చేవారు వుండాలే కానీ, సినిమాజనాల రెమ్యూనరేషన్స్ కూడా లెక్కకు మించే వుంటాయి. లేటెస్ట్ గా బాలయ్య-బోయపాటి కాంబినేషన్ సినిమాల పారితోషికాలు ఇలాగే వున్నాయి. ఈ సినిమా కోసం బాలయ్యకు తొలిసారిగా 10 కోట్ల రెమ్యూనరేషన్ అందుతోంది. 

 

ఇప్పటి వరకు బాలయ్య తీసుకున్నది హయ్యస్ట్ రెమ్యూనరేషన్ 9 కోట్లు. అది కూడా రూలర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో-సి.కళ్యాన్ నిర్మిస్తున్న సినిమా. బోయపాటి సినిమాకు 12 కోట్లు డిమాండ్ చేసినట్లు టాక్. ఆఖరికి 10 దగ్గర సెటిల్ అయింది. ఇక ఈ సినిమాకు దర్శకుడిగా బోయపాటి 15 కోట్లు తీసుకుంటున్నారు. అంటే హీరో రెమ్యూనిరేషన్ కన్నా అయిదు కోట్లు ఎక్కువ. హీరో-డైరక్టర్ ల రెమ్యూనిరేషన్ లే పాతిక కోట్లు అయిపోతాయి.

 

మ్యూజిక్ డైరక్టర్, సినిమాటోగ్రాఫర్, ఇంకా కీలక టెక్నీషియన్లు, ఇతర స్టార్ కాస్ట్ కలిసి మరో ఏడు కోట్ల వరకు అంచనా వేసున్నారు. వీటన్నిటికీ మించి బోయపాటి స్టయిల్ మేకింగ్. ఈ మేకింగ్ కి కూడా బాగానే ఖర్చవుతుంది. అంతా కలిపి బోయపాటి ఇచ్చిన బడ్జెట్ 70 కోట్లు. ఈ బడ్జెట్ కి భయపడే మైత్రీ మూవీస్ ఈ ప్రాజెక్టు నుంచి వెనక్కు వెళ్లినట్లు టాక్. అప్పుడు మిరియాల రవీందర్ రెడ్డి రంగంలోకి వచ్చారు. మరి మిరియాల ఇంత పెద్ద రిస్క్ ఎందుకు చేస్తున్నాడో తెలీదు. పైగా ఈ నిర్మాత గత చిత్రాలు ఫ్లాప్ గా మిగిలాయి. ఇక రీసెంట్‌గా రిలీజైన బాలయ్య కొత్త సినిమా రూలర్ ట్రైలర్ నందమూరి ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా డిసెంబర్ ఆఖరున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: