ఇస్మార్ట్ శంకర్ సినిమాతో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. లిమిటెడ్ బడ్జెట్ తో రాం పోతినేని ని ఊర మాస్ హీరోగా ప్రజెంట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. 2019 లో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అంటే ఇస్మార్ట్ శంకరనే చెప్పాలి. ఇస్మార్ట్ టీం మొత్తానికి ఈ సినిమా ఫుల్ ఎనర్జీని ఇచ్చింది. అందరికి పెద్ద సక్సస్ ఇచ్చింది. ఆ ఉత్సాహంతో పూరి నెక్స్ట్ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ బాలీవుడ్ ప్రవేశానికి అంతా రెడీ అయిపోతోంది. డైరక్ట్ బాలీవుడ్ సినిమా కాకుండా, తెలుగు సినిమానే హిందీలో కూడా రూపొందించే ప్లాన్ చేస్తున్నారు.

 

పూరి జగన్నాధ్ డైరక్షన్ లో తెరకెక్కబోయే ఫైటర్ సినిమాను బాలీవుడ్ లో కూడా విడుదల చేసేందుకు నిర్మాత కమ్ దర్శకుడు పూరి జగన్నాధ్ సన్నాహాలు మొదలుపెట్టినట్టు టాలీవుడ్ లో ఒక వార్త వైరల్ అవుతోంది.  ఈ ఇందుకు గాను బాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కరణ్ జోహార్ తో గత రెండు రోజులుగా జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయట. వారిద్దరి మధ్య ఓ ఒప్పందం కుదిరిందని లేటేస్ట్ న్యూస్.

 

బాహుబలి సినిమాను పంపిణీ చేసినట్లే ఫైటర్ సినిమాను కూడా బాలీవుడ్ లో కరణ్ జోహార్ ప్రమోట్ చేసి, పంపిణీ చేస్తారని తాజా సమాచారం. ఈ మేరకు నిర్మాణానికి ఆర్థిక సహకారం కూడా అందించబోతున్నారట. బాలీవుడ్ ఎంట్రీకి అనుగుణంగా స్క్రిప్ట్ ను ట్యూన్ చేసే బాద్యత పూరి జగన్నాధ్ దే నట. ఈ మేరకు స్టార్ కాస్ట్ లో కూడా చిన్న చిన్న మార్పులు చోటు చేసుకోబుతున్నాయని తాజా సమాచారం.

 

గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ మీద ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. తెలుగులో విజయ్ నటించిన అర్జున్ రెడ్డి ఎప్పుడైతే బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ అయి బ్లాక్ బస్టర్ అయిందో విజయ్ కి ఇంకా ఉత్సాహం రెండింతలైంది. అదీ కాకుండా బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కూడా విజయ్ అంటే పడి చచ్చిపోతున్నారు. ఇక నటన విషయంలోను బాలీవుడ్ హీరోయిన్స్ విజయ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైటర్ సినిమాను పాన్ ఇండియా సినిమాగా మార్చడం అంటే పూరి జగన్నాధ్ కు, విజయ్ దేవరకొండకు గోల్డెమ్న్ ఛాన్స్ అని అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ లేదా కియారా అద్వాని ని విజయ్ సరసన హీరోయిన్ గా సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.   
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: