తెలుగు సినిమాల్లో తనకంటూ ఓ స్టైల్ క్రియేట్ చేసుకున్న హైపర్ యాక్టివ్ హీరో రామ్ పోతినేని. ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ తోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్. కానీ తనకున్న డాన్సింగ్ టాలెంట్, ఎనర్జీతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. తొలి సినిమా దేవదాస్ తోనే తానూ సినిమాలకు సరిపడే ఓ ప్రామిసింగ్ హీరోగా నిరూపించుకున్నాడు. అతని కెరీర్లో హిట్స్ ఉన్నాయి.. ఫ్లాప్స్ ఉన్నాయి. అయితే.. రామ్ సంతోషపడే విషయం ఏమిటంటే తెలుగులో అతని ఫ్లాప్ సినిమాలు యూట్యూబ్ లో డబ్బింగ్ వెర్షన్ లో హిట్ అవడం. ఇది రామ్ సాధించిన విజయంగా చెప్పుకోవాల్సిందే.

 

 

గతేడాది దసరా పండుగ సమయంలో విడుదలైన రామ్ సినిమా హలో గురూ ప్రేమకోసమే. ఈ సినిమా తెలుగులో ఫ్లాప్ అయింది. అయితే తెలుగు సినిమాలకు యూట్యూబ్ లో ఉన్న డిమాండ్, రామ్ సినిమాలకు యూట్యూబ్ లో ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ సినిమాను ‘ధూందార్ కిలాడీ’గా విడుదల చేశారు. అనూహ్య రీతిలో ఈ సినిమా 140మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుని ఇంకా దూసుకుపోతోంది. పైగా 1మిలియన్ వ్యూస్ లైక్ లను కూడా సాధించింది. దీంతో తెలుగులో ఫ్లాప్ అయిన సినిమాను హిందీ డబ్బింగ్ లో హిట్ కొట్టినట్టయింది రామ్ కు. నేను శైలజ్ సినిమా కూడా 130మిలియన్ వ్యూస్ సాధించి యూట్యూబ్ లో పాపులర్ అయ్యాడు రామ్.

 

 

ప్రస్తుతం రామ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ గా వచ్చి అతను కొట్టిన దెబ్బ మామూలుది కాదు. రామ్ కెరీర్ కు, పూరి గ్రాఫ్ కు ఒకేసారి బూస్ట్ ఇచ్చినట్టైంది. ఇప్పుడు హలో గురూ ప్రేమతో సినిమాతో యూట్యూబ్ లో రికార్డులు కొడుతున్నాడు. మొత్తానికి రామ్ హిందీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: