దీపావళి నుండి  టాలీవుడ్ లో బాక్సాఫీస్ వద్ద   సినిమాల సందడి  తగ్గిపోయింది. అయితే అదే టైం లో  రెండు  తమిళ సినిమాలు మాత్రం తెలుగులో కూడా  సందడి చేశాయి.  అందులో ఒకటి విజయ్ నటించిన విజిల్ కాగా  రెండవది  కార్తి నటించిన  ఖైదీ.  ఈరెండు  సినిమాలు కూడా మంచి వసూళ్లను రాబట్టుకొని సూపర్ హిట్లు అనిపించుకున్నాయి.  ఆ  తరువాత  నవంబర్ లో కూడా  పెద్ద సినిమాలు లేక  థియేటర్లు వెలవెలబోయాయి. తెలుగులో విడుదలైన చిన్న సినిమాల్లో ఏ ఒక్కటి కూడా  ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. 
 
నవంబర్ చివర్లో  నిఖిల్  అర్జున్ సురవరం తో సందడి చేశాడు. ఈచిత్రానికి  రివ్యూస్ నెగిటివ్ గా వచ్చిన టాక్ బాగుండడంతో  స్టడీగా  కలెక్షన్స్ ను రాబట్టుకుంటూ హిట్ అనిపించుకుంది.  ఈచిత్రం గతవారం హైదరాబాద్ లో  అత్యధిక  గ్రాసర్ గా నిలిచిందని  బుక్ మై షో  ప్రకటించింది. ఇక  అర్జున్ సురవరం  10రోజుల్లో  9కోట్ల షేర్ ను రాబట్టి అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్  అయ్యింది.   వెంకీ మామ వచ్చే వరకు ఈచిత్రం డీసెంట్ వసూళ్లనే రాబట్టుకోనుంది. అసలు విడుదలవుతుందా లేదో అనే దగ్గర్నుండి  ఏకంగా  హిట్ జాబితాలో చేరిపోయింది ఈ చిత్రం. 
 
 
 ఇక  నిఖిల్  ఎట్టకేలకు చాలా రోజుల తరువాత  ఈచిత్రం తో హిట్ కొట్టాడు. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ  'కనితన్' కి  రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో  నిఖిల్ కు జోడిగా లావణ్య త్రిపాఠి నటించగా  సామ్ సి ఎస్ సంగీతం అందించాడు.  ఒరిజినల్ వెర్షన్ ను తెరకెక్కించిన  టియెన్ సంతోషే ఈ రీమేక్ ను కూడా డైరెక్ట్ చేయగా  రాజ్ కుమార్ ఆకేళ్ల , కావ్య వేణుగోపాల్  సంయుక్తంగా  నిర్మించారు. ఈసినిమాలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: