ప్రతి సంక్రాంతికి తెలుగు సినిమా ప్రేక్షకులను పలకరించే బాలయ్య బాబు ఈ సారి ముందే అనగా క్రిస్మస్ పండుగ సీజన్ సమయంలో కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో నటించిన ‘రూల‌ర్‌’ సినిమా రిలీజ్ చేయటానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో బాలయ్య బాబు రెండు డిఫరెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు సినిమా ట్రైలర్ బట్టి అర్థం అవుతుంది. తాజాగా ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ చూసిన నందమూరి అభిమానులు ఖచ్చితంగా బాలయ్య బాబు ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టడం గ్యారెంటీ అని అంటున్నారు. బాలయ్య బాబు నటించిన చివరి రెండు సినిమాలు ఎన్టీఆర్ బయోపిక్ కి చెందిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో నందమూరి అభిమానులు తీవ్ర నిరుత్సాహం చెందారు.

 

దీంతో బాలయ్య బాబు ‘రూల‌ర్‌’ సినిమాతో విజయం సాధించి అభిమానులను ఎలాగైనా ఖుషి చేయాలి డిసైడ్ అయిపోయి ఈ సినిమా కోసం బాలయ్య చాలా కష్ట పడినట్లు ఫిలింనగర్లో వార్తలు వినబడుతున్నాయి. అంతేకాకుండా లుక్స్ మరియు సినిమా తెరకెక్కించే విధానం లాంటి విషయాలలో బాలయ్య బాబు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అంట. దీంతో తాజాగా విడుదలైన ట్రైలర్ లో మరియు సినిమాకి సంబంధించిన పిక్స్ లో చాలా ఫ్రెష్ గా బాలయ్యబాబు కనబడటంతో బాలయ్య లుక్ పై అభిమానులు కూడా మంచి జోష్ మీద ఉన్నారు.

 

ఇదిలా ఉండగా సినిమాకి సంబంధించి స్టోరీ ఇదే అని నిర్మాత రివీల్ చేశారు… ‘రూల‌ర్‌’ మంచి స్టోరీ కలిగిన సినిమాని ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేని సినిమా అని. ఉత్తరప్రదేశ్‌లో స్థిరపడిన తెలుగువాళ్ల కథ. సెటిలర్స్‌ సమస్యల్ని నేపథ్యంగా తీసుకుని అల్లుకున్న కథ ఇది. చాలా బాగా వచ్చింది. బాలయ్య అభిమానులకు విందు భోజనంలా ఉంటుంది. పాటలకు, ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది’’ అన్నారు. దీంతో నిర్మాత చెప్పిన లైన్ విని సోషల్ మీడియాలో అభిమానులు ఖచ్చితంగా  ‘రూల‌ర్‌’ సినిమాతో బాలయ్య బాబు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించడం గ్యారెంటీ అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: