బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా RRR. సౌత్ ఇండస్ట్రీలో భారీ మల్టీస్టారర్ సినిమాగా ఇప్పటికే ఈ సినిమా సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు పెద్ద కుటుంబాలు పైగా మెగా మరియు నందమూరి కుటుంబాలకు చెందిన యువ హీరోలు వారసులు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి నటిస్తున్న నేపథ్యంలో 'RRR' సినిమాపై కూడా ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. మరోపక్క దేశవ్యాప్తంగా 'బాహుబలి' సినిమాతో తనకంటూ సెపరేట్ క్రేజ్ ఏర్పరుచుకుని అంతర్జాతీయస్థాయిలో మంచి గుర్తింపు పొందిన డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం లో వస్తున్న నేపథ్యంలో సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులకు సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అన్న ఆసక్తి నెలకొంది.

 

ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు డైరెక్టర్ రాజమౌళి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా ఆలియా భట్ నటిస్తున్న విషయం అందరికీ తెలిసినదే. కాగా 'RRR' సినిమాలో ఆలియా భట్ సన్నివేశాలకు సంబంధించి రాజమౌళి ఇటీవల మొత్తం కంప్లీట్ చేసినట్లు ఫిలింనగర్లో టాక్ వినబడుతోంది. చాలావరకు సినిమా షూటింగ్ అయినట్లు కేవలం జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కి సంబంధించిన పోరాటాల సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్న బ్యాలెన్స్ అన్నట్లు టాక్ నడుస్తుంది.

 

దీంతో సంక్రాంతి ముందే సినిమాకి సంబంధించి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి తర్వాత సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలెట్టే ఆలోచనలో డైరెక్టర్ రాజమౌళి ఉన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు చాలా శరవేగంగా సాగుతున్నట్లు ఏది ఏమైనా అనుకున్న టయానికి వచ్చే ఏడాది జూలై 30 వ తారీకు సినిమాని దాదాపు పది భాషల్లో విడుదల చేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: