ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మంచి అవకాశాలతో దూసుకెళ్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఎస్ ఎస్ థమన్ ఒకరు. కొన్నాళ్ల క్రితం కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వం లో వచ్చిన బాయ్స్ సినిమాలో ఒక ముఖ్యమైన క్యారెక్టర్ లో నటించిన థమన్, ఆ తరువాత నుండి తన మ్యూజిక్ పై మరింతగా శ్రద్ధ పెట్టి, అనేకమంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పని చేయడం జరిగింది. ఇక అక్కడి నుండి మెల్లగా పూర్తిగా మ్యూజిక్ పై మంచి పట్టు సాధించిన థమన్, 2008లో వచ్చిన భీభత్సం అనే సినిమాతో పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాడు. 

 

ఆ తరువాత రవితేజ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన కిక్ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందించిన థమన్, అక్కడి నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందిపుచ్చుకుని, నేడు టాలీవుడ్ లోని అగ్ర సంగీత దర్శకుల్లో ఒకడిగా ఎదిగాడు. ఇక ఇటీవల ఆయన అలవైకుంఠపురములో సినిమాకు అందించిన సాంగ్స్ యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ మరియు లైక్స్ తో దూసుకుపోయిన విషయం తెల్సిందే. 

 

ఇక తన వ్యక్తిగత మరియు సినిమా లైఫ్ గురించి ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి మొన్న ఇంటర్వ్యూ ఇచ్చిన థమన్, తన లైఫ్ లో తాను ఒక వ్యసనాన్ని మాత్రం వదులుకోలేనని అన్నారు. అదే క్రికెట్ అని, తనకు సంగీతం సగం అయితే, అదే విధంగా మిగతా సగం క్రికెట్ అని, అది ఒకరకంగా తన జీవితంలో వ్యసనంగా మారడం వల్లనే తనకు ఎంతో మంచి మేలు జరిగిందని థమన్ చెప్పుకొచ్చారు. వ్యసనం అంటే మనం అందరం అనుకునే చెడు చేసేది కాదని, క్రికెట్ ఆడుతూ ఎంతో రిలాక్స్ అయ్యే తనకు, సినిమాల విషయమై చేసే తప్పులు ఇకపై చేయకూడదని అనిపిస్తుందని, అలానే క్రికెట్ వలన తాను మానసికంగా ఎంతో ఉత్సాహంగా ఉంటానని థమన్ చెప్పుకొచ్చారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: