బాలకృష్ణ సినిమాలకు సింహాలకు చాల దగ్గర సంబందిం ఉంది. బాలయ్యను నట సింహా అని అంటూ కొందరు పిలుస్తూ ఉంటారు. దీనికి తగ్గట్టుగా బాలకృష్ణ ‘లక్ష్మి నరసింహా’ ‘సింహా’ ‘లయన్’ ‘జై సింహా’ లాంటి సినిమాలలో నటించిన నేపధ్యంలో బాలయ్యకు సింహం సెంటిమెంట్ ఎక్కువ అన్నఅభిప్రాయం ఉంది. 

దీనికితోడు బాలకృష్ణ లక్ష్మీ నరసింహ స్వామి వీర భక్తుడు. ప్రతిసంవత్సరం బాలయ్య లక్ష్మీ నరసింహ స్వామి పూజను చాల నిష్ఠగా చేస్తాడని ఒక ప్రచారం కూడ ఉంది. కేవలం  బాలయ్య సినిమాలకు సంబంధించి టైటిల్స్ లో సింహాన్ని పెట్టడమే కాదు ఆయన డైలాగులు పాటల్లో కూడా ఈపదాన్ని విపరీతంగా వాడుతు  ఉంటారు. 

ఇలా బాలయ్య ఎంట్రీ ఇస్తున్నప్పుడు కొన్ని సినిమాలలో వాడిన సింహం సౌండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య లేటెస్ట్ మూవీ ‘రూలర్’ టైటిల్ ప్రెజెంటేషన్ లో సింహం బొమ్మను చూపించి గర్జనను వినిపించి ఈమూవీకి మ్యానియాను క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. ఇక లేటెస్ట్ గా ఈమూవీకి సంబంధించి విడుదలైన ట్రైలర్ లో ‘‘పార్శిల్ చేయడానికి ఇది దెబ్బ తిన్న సింహంరా.. అంత సులువుగా చావదు.. వెంటాడి వేటాడి చంపుద్ది’’ అంటూ ఒక పాత్రతో బాలయ్య ఎలివేట్ చేయడానికి ప్రయత్నించారు. ఈ ట్రైలర్ ను చూసిన కొంతమంది మాత్రం బాలయ్య సింహం సెంటిమెంట్ పై సెటైర్లు వేస్తూ ‘బాలయ్య ఇక నువ్వు మారవా’ అంటూ సోషల్ మీడియాలో బాలయ్యను ఉద్దేశిస్తూ అభ్యర్ధనలను పోస్ట్ చేస్తున్నారు. 


ఇప్పటికే ఈమూవీలో బాలకృష్ణ వాడిన విగ్గుల పై అనేక సెటైర్లు పడుతున్న నేపధ్యంలో ఇప్పుడు ఇలా బాలయ్య సింహం సెంటిమెంట్ ను టార్గెట్ గా చేసుకుని కొందరు బాలయ్య వ్యతిరేకులు నానా హడావిడి చేస్తున్నారు. ఈపరిస్థితులు ఇలా ఉంటే బోయపాటి బాలయ్యల మూవీలో హీరోయిన్ గా కీర్తి సురేశ్ ఎంపిక అయింది అన్న వార్తల పై కొందరు స్పందిస్తూ కీర్తి సురేశ్ ఫై జాలిని కనపరుస్తూ ఆమె పరిస్థితి ఇలా మారిపోయిందా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ నేపధ్యంలో రూలర్ మూవీకి టోటల్ పాజిటివ్ టాక్ వస్తే తప్ప ఆమూవీకి బాలయ్య అభిమానులు కోరుకునే కలక్షన్స్ రావు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: