ఆర్ఆర్ఆర్...  ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి . ఇప్పటికే ఎన్నో సంచలనాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన జక్కన్న... ఎన్నో సంచలన రికార్డు సృష్టించారు. ఇక ఇప్పటి వరకు ఓటమి ఎరుగని దర్శకుడు గా దూసుకుపోతున్న జక్కన్న తెరకెక్కిస్తున్న మూవీ ఆర్.ఆర్.ఆర్.  ఇక అంతే కాకుండా టాలీవుడ్ సూపర్ స్టార్స్ అయిన జూనియర్ ఎన్టీఆర్రామ్ చరణ్ తో రాజమౌళి సినిమా తెరకెక్కిస్తుండడంతో ఇక ఆ అంచనాలు కాస్త ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులే కాదు అన్ని  ఇండస్ట్రీల ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. 

 

 

 

 ఇక అటు ఈ సినిమా చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న తేదీ రోజే సినిమాను విడుదల చేయాలని జక్కన్న భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో  రామ్ చరణ్ సరసన నటిస్తున్న ఆలియా భట్ ఇటీవలే  ఆర్ఆర్ఆర్  చిత్రం షూటింగ్ కంప్లీట్  అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ కు జంటగా నటిస్తున్న నటి ఒలీవియా మోరిస్ పై చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో ఎనిమిది పాటలు ఉండే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆరు పాటలు దేశభక్తి పాటలు గా ఉండగా... ఇంకా రెండు పాటలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు చెరో డ్యూయెట్  ఉంటాయని తెలుస్తోంది. చరిత్రలో కలవని దేశభక్తులైన అల్లూరి సీతారామరాజు కొమురం భీమ్  కలిస్తే ఎలా ఉంటుంది అనే కాల్పనిక కథ ద్వారా ఈ సినిమా ఈ విషయాన్ని ఇప్పటికే రాజమౌళి క్లారిటీ ఇచ్చారు కూడా. 

 

 

 

 ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో లీక్  కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సినిమాలు కథను మలుపుతిప్పే పాత్రలు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ ఎన్టీఆర్ పాత్రలకు దీటుగా ఈ పాత్ర ఉండబోతుంది అని సమాచారం. అయితే సంక్రాంతి కానుకగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాగా ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న తేదీకే విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆర్.ఆర్.ఆర్ వర్కింగ్ టైటిల్ గా ఉన్న ఈ సినిమాకు సోషల్ మీడియాలో చాలా టైటిల్స్  ప్రచారం జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: