అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు చాలా హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గం చెందిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసెంబ్లీలో ప్రసంగిస్తున్న సందర్భంలో అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మరియు అధ్యక్షుడు చంద్రబాబు ఒక్కసారిగా లెగిసి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లి పోయే ప్రయత్నం చేయడం జరిగింది. దీంతో వల్లభనేని వంశీ అసెంబ్లీలో మాట్లాడుతూ ఎందుకు భయపడుతున్నారు చంద్రబాబు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ...దిమ్మతిరిగే కామెంట్ చేశారు.

 

ముఖ్యంగా తాను ముఖ్యమంత్రి జగన్ ని ఎందుకు కలవడం జరిగింది వంటి విషయాలపై వల్లభనేని వంశీ మాట్లాడుతూ...తాను తన నియోజకవర్గంలో తనను ఎన్నుకున్న పేద ప్రజల కోసం వాళ్లకు ఇచ్చిన మాట కోసం అనగా గతంలో చంద్రబాబు హయాంలోనే ఉన్న సమయంలో వాళ్ళందరికీ పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ ని కలవటం జరిగిందని మరియు అదే విధంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పనుల విషయంపై మరియు నియోజకవర్గంలో ఇంకా అనేక సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ ని కలవడం జరిగింది అని దానికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు అంటూ వల్లభనేని వంశీ అసెంబ్లీ సాక్షిగా నిలదీయడం జరిగింది.

 

దీంతో సభలో గందరగోళం వాతావరణం నెలకొంది. చాలా మంది తెలుగుదేశం పార్టీ సభ్యులు సభ నుండి వంశీ మాట్లాడుతున్న సమయంలో బయటికి వెళ్లే ప్రయత్నాలు చేయడం సభలో గోల గోల చేయడంతో స్పీకర్ కలుగజేసుకుని శాసనసభ్యుడిగా తన అభిప్రాయాన్ని చెప్పటం సభ ఇచ్చిన హక్కు అని మాట్లాడుతూ సభని కంట్రోల్ చేశారు. దీంతో వల్లభనేని వంశీ రెండో రోజు అసెంబ్లీలో మాట్లాడిన సందర్భం ఇప్పుడు ఏపీ మీడియా వర్గాల్లో మరియు అదే విధంగా సోషల్ మీడియాలో హైలెట్ గా మారింది. గతంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన వంశీ ఎమ్మెల్యేగా గన్నవరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పటం జరిగింది. ఇటువంటి పరిణామాల మధ్య వంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: