సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఒకటి రెండు రోజుల్లో రాదు. హీరోలకు లాంగ్ కెరీర్‌ ఉండడంతో వాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే హీరోయిన్ల‌కు చాలా తక్కువ కెరీర్ మాత్రమే ఉంటుంది. వాళ్లకు క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి. హీరోయిన్ కావడానికి ఎంత కష్ట పడతారో.. ఆ క్రేజ్‌ నిలబెట్టుకోవటానికి కూడా అంతే కష్టపడాలి. ఒక‌టి, రెండు రెండు ఫ్లాపులు వచ్చాయంటే మళ్లీ ఆ హీరోయిన్ తో సినిమా చేసేందుకు ఎవరూ ఇష్టపడరు.

 

కొంతమంది హీరోయిన్లు తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టిన ఆ తర్వాత తన కెరీర్ ను ఎలా ?మలచుకోవాలో తెలియక కెరీర్ వాళ్లే నాశ‌నం చేసుకుంటుంటారు. అయితే ప్రస్తుతం హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పూత్ పరిస్థితి కూడా అలానే తయారయ్యింది. తన మొదటి సినిమా ఆరెక్ష్ 100 తో కుర్రకారును పిచ్చేక్కించిన పాయల్. అస‌లు ఆ సినిమాతో ఆమెకు వ‌చ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. మొత్తం అంద‌రూ పాయ‌ల్ నామ‌స్మ‌ర‌ణ చేసేశారు.

 

యూత్ లో ఆమెకు పిచ్చి క్రేజ్ వ‌చ్చేసింది. ఆ తరువాతి సినిమా విషయంలో చాలా పెద్ద పొరపాటు చేసింది. అదే సీక్వెల్ లో రెండో సినిమా తీసి ఉన్న కాస్తా ఇమేజ్ పోగొట్టుకుంది. అప్ప‌టి నుంచి ఆమెకు మ‌రీ బోల్డ్ త‌ర‌హా క్యారెక్ట‌ర్లే వ‌చ్చాయి. ఆ త‌ర్వాత ఆమెకు ఎలాంటి ఛాన్స్ వ‌చ్చినా బోల్డ్ క్యారెక్ట‌ర్లే ఇస్తున్నార‌ట‌... గ్లామ‌ర్ బాగా ఒల‌క బోయాల‌న్న కండీష‌న్లు పెట్టేస్తున్నార‌ట‌.

 

దీంతో రెండు మూడు సినిమాల్లో అలాంటి క్యారెక్ట‌ర్లే చేసిన పాయ‌ల్ చివ‌ర‌కు విసుగొచ్చేసి వీళ్లంతా త‌న‌ను ఇలా వాడేసుకుంటున్నార‌ని.. ఇలాంటి క్యారెక్ట‌ర్లు చేస్తున్నందు వ‌ల్లే త‌న‌కు పెద్ద హీరోల సినిమాల్లో అవ‌కాశాలు రావ‌డం లేద‌ని లేటుగా తెలుసుకుంద‌ట‌. ఆమె చేసిన రెండు మూడు బోల్డ్ సినిమాలు విడుద‌ల‌కు ముందే వెంకీ మామ లో తీసుకోవడంలో ప్రతికిపోయిందని చెప్పాలి లేదంటే ఈ సినిమా షూటింగ్ కి ముందే ఆర్డీఎక్స్‌ లవ్ విడుదలైతే ఈ అవకాశం కూడా ఉండేదికాదన్న మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: