మిడిల్ రేంజ్ హీరోలలో నాని అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ఒక్క సరైన బ్లాక్ బస్టర్ హిట్ పడితే చాలు నాని టాప్ యంగ్ హీరోల లిస్టులో చేరిపోతాడు. అక్కడే నానీకి అదృష్టం చేజారిపోతోంది. ఇలాంటి పరిస్థితులలో నాని లేటెస్ట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో పై కొందరు సానుభూతి చూపెడుతుంటే మరికొందరు జోక్స్ వేస్తున్నారు. 

నాని ఒక ఫోటోను షేర్ చేస్తూ ‘తెల్ల జుట్టు వచ్చేస్తోందిరోయ్’ అంటూ తన పై తానే జోక్ వేసుకుంటూ టెన్షన్ పడుతున్న ఫోటోను సరదాగా షేర్ చేసాడు. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ గా మారడంతో కొంతమంది నానీ పై జోక్స్ వేస్తున్నారు. వయసు పెరిగి పోతోంది ఇంకా టాప్ హీరోల రేంజ్ కి చేరుకోలేకపోయాను అని టెన్షన్ పడిపోతున్నావా అంటూ కొందరి కామెంట్స్. 

మరికొందరైతే ఈమధ్య లేటెస్ట్ గా విడుదలైన ‘గ్యాంగ్ లీడర్’ ఫెయిల్ అయినందుకు బెంగ పెట్టుకోవడంతో ఆ టెన్షన్ కు జుత్తు మెరిసిపోతోందా అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. అయితే నాని అభిమానులు మాత్రం నానీలో నిజాయితీ పెరిగి పోతోందనీ కామెంట్స్ చేస్తున్నారు. 60 సంవత్సరాలు దాటిపోయిన హీరోలు కూడ తమ వయసును బయట పడనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే నాని మాత్రం తన జుట్టు మెరిసిపోయిందని ఎటువంటి మొహమాటాలు లేకుండా నిజాలు చెపుతున్నాడు అంటూ నాని పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

ఈ సందర్భంలో మరి కొందరు అయితే  తెల్ల జుట్టుతోనూ బోలెడంత మ్యాజిక్ చేయవచ్చని అజిత్ రజనీకాంత్ లాంటి టాప్ హీరోలను నాని ఆదర్శంగా తీసుకుంటున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.    2020లో నానీ నటిస్తున్న పలు క్రేజీ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఇంద్రగంటి `వి`లో నాని నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు ‘నిన్ను కోరి’ ఫేం శివ నిర్వాణ తో `టక్ జగదీశ్` అనే చిత్రం కూడ  చేస్తున్నాడు. ఈ సినిమా కోసం నాని కోరమీసంతో పాటు గుబురుగడ్డం పెంచుతున్నాడట.  ఇలా తాను నటించే ప్రతి సినిమా విషయంలో వెరైటీ కనిపించేలా ప్రయత్నాలు చేస్తున్న నాని కృషి ఫలించి వచ్చే ఏడాది అయినా నానీకి ఒక బ్లాక్ బస్టర్ హిట్ రావాలని ఆశిద్దాం.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: