సురేష్ ప్రొడక్షన్స్ లో వచ్చే సినిమాలు చాలా వరకు ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు అయ్యి ఉంటాయి.  కథను నమ్మి ఆ ప్రొడక్షన్ సంస్థ సినిమా తీస్తుంది.  ఈ ప్రొడక్షన్ లో వచ్చిన సినిమాలు 90శాతం వరకు హిట్ కావడం విశేషం.  సరేష్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో తీసే సినిమాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.   విధంగా చెప్పాలి అంటే అసలు భారీ ఖర్చు చేసేందుకు ఆ సంస్థ పెద్దగా అంగీకరించదు.  


కానీ, ఈ సంస్థ నుంచి మాత్రం అనేక హిట్ చిత్రాలు వచ్చాయి.  ఇప్పుడు వెంకిమామ సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతున్నది.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  వెంకంటేష్, నాగ చైతన్య హీరోలుగా చేస్తున్నారు.  రియల్ లైఫ్ లో మేనల్లుడైన చైతు, రీల్ లైఫ్ లో అల్లుడిగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.  ఈ సినిమాను కామెడీ, లవ్, ఎమోషన్ వే లో నిర్మించబోతున్నారు.  సినిమాకు ఇప్పటికే పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది.  


ఇక ఇదిలా ఉంటె, సురేష్ ప్రొడక్షన్స్ లో వస్తున్న ఈ సినిమాలో అసలు కథ ఏంటి ఎందుకు సినిమాకు వెంకిమామ అనే పేరు పెట్టారో తెలుసుకుందాం.  రియల్ లైఫ్ లో వెంకటేష్ ను  అని పిలుస్తూ ఉంటాడు.  అందుకే ఈ సినిమాకు వెంకిమామ అని పేరు పెట్టాడు.   కథకు అత్యంత  ప్రాధాన్యత ఇచ్చే ప్రొడక్షన్ లో అసలు ఈ సినిమా కథ ఏంటి... ఎందుకు ఈ సినిమాకు బాబీ ని ఎంచుకున్నారు.  


సినిమా కథ విషయానికి వస్తే.. చిన్న తనం నుంచి వెంకటేష్ చైతూను అల్లారు ముద్దుగా పెంచుతాడు.  అదే వెంకటేష్ చైతు కోసం వెంకటేష్ ఏం  చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు.  అలాంటి చైతు అనుకోకుండా కొన్ని కారణాల వలన ఆర్మీలోకి వెళ్లడంతో వెంకటేష్ కు ఏమి అర్ధం కాదు.  మేనల్లుడి కోసం ఎదురుచూస్తుంటారు.  మూడేళ్ళ వరకు తిరిగి రాకపోవడంతో చైతూ కోసం ఆర్మీకి ఆఫీసర్స్ ను కావడం... ఆ తరువాత ఏం జరిగింది అన్నది మిగతా కథ.  

మరింత సమాచారం తెలుసుకోండి: