బుల్లితెరపై హీరోల రేంజ్ లో క్రేజ్ సంపాదించిన కమెడియన్ సుడిగాలి సుదీర్. ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షోలో సాదాసీదా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఏకంగా టీం లీడర్ గా మారిపోయాడు. జబర్దస్త్ లో ఎంతోమంది టీం లీడర్లు మారుతున్నప్పటికీ సుడిగాలిసుధీర్ మాత్రం తన సత్తా చాటుతూ నవ్వుల పువ్వులు పోలుస్తూ తన హవా నడిపిస్తున్నాడు. అయితే ఒక కామెడీ లోనే కాకుండా అటు యాంకరింగ్ లో కూడా వివిధ షోలు చేస్తూ అందరినీ మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇక మరోవైపు మ్యాజిక్ షోలు చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు సుడిగాలి సుధీర్. ఇక ఈ టీవీలో ప్రసారమయ్యే డీ షో లో ఓవైపు కామెడీ చేస్తూనే మరోవైపు తన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో ఇరగదీస్తాడు. 

 


 అయితే ప్రస్తుతం ఏకంగా టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు సుడిగాలి సుదీర్. ప్రస్తుతం సుడిగాలి సుదీర్ నటించిన సాఫ్ట్వేర్ సుదీర్ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. కాగా ఈ చిత్రం ప్రమోషన్స్లో అటు చిత్రబృందం కూడా బిజీగా ఉంది. ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం పాటలు విడుదల చేయగా  వచ్చిన అవకాశాన్ని సుధీర్ సరైన రీతిలో వాడుకొని తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే లాగే కనిపిస్తున్నాడు . అయితే తాజాగా సుడిగాలి సుదీర్ ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రియల్ లైఫ్ కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. 

 

 కాగా ఈ షోలో తన జీవితంలో తనకు ఎదురైన ఒక మధుర జ్ఞాపకాన్ని  గుర్తు చేసుకొని అభిమానులకు తెలిపారు. తాను కొత్తగా ఇల్లు కొనుక్కొని గృహప్రవేశానికి మెగాస్టార్ చిరంజీవి గారిని ఆహ్వానించడానికి ఆయన ఇంటికి వెళ్లాలని సుధీర్ తెలిపారు. ఆ సమయంలో తన తమ్ముడు కూడా తన  పక్కనే ఉన్నాడు అని తెలిపారు. అయితే చిరంజీవి గారు  అంత పెద్ద స్టార్ అయినప్పటికీ మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించారు అని సుదీర్ చెప్పుకొచ్చారు. తమకు ట్రేలో  పాలు తెప్పిస్తే తాగడానికి  కొంత మొహమాట పడ్డాను అని.. కానీ ఆయనే స్వయంగా పాలు కలిపి ఇవ్వటంతో  జన్మ ధన్యమైపోయింది అనుకున్నానని సుడిగాలి సుదీర్ అన్నారు. ఇక ఆ తర్వాత చిరంజీవి గారు  కొత్తబట్టలు గిఫ్ట్ తెప్పించి ఇచ్చారని సుడిగాలి సుదీర్ తెలిపారు. తాను చిన్నప్పటినుంచి అభిమానించే ఓ స్టార్ హీరో... తను అంతటి ప్రేమతో చూడడంతో కన్నీళ్లు ఆగలేదు అని తెలిపారు. చిరంజీవి గారి ఇంట్లో నుంచి బయటకు వచ్చాక... ఆయన చూపించిన ఆప్యాయత గురించి అమ్మానాన్నలకు కాల్ చేసి  చెబుతూ గట్టిగా ఏడ్చేశానని సుడిగాలి సుదీర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: