స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అల వైకుంఠపురములో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. త్రివిక్రం డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్ని సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలుసిందే. ఈ మూవీలో పూజా హెగ్దెతో పాటుగా నివేదా పేతురాజ్ కూడా సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే సినిమాలో నివేదా బన్నికి సిస్టర్ రోల్ చేస్తుందని తెలుస్తుంది.

 

షూటింగ్ టైంలో బన్ని హార్డ్ వర్క్ చూసి షాక్ అయ్యిందట నివేదా పేతురాజ్. స్టార్ హీరోకి ఇంత డెడికేషన్ ఉండటం గొప్ప విషయమని అంటుంది. ఇక డ్యాన్స్ అయితే అల్లు అర్జున్ స్పీడ్ తట్టుకోవడం కష్టమే అంటుంది అమ్మడు. అతనితో డ్యాన్స్ చేయాలంటే చాలా కష్టమని అంటుంది నివేదా పేతురాజ్. తెలుగులో మెంటల్ మదిలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఆల్రెడీ తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 

వాచ్ మెన్ ను అలా వాడేసుకుంటున్న హీరోయిన్.. నెటిజెన్లు షాక్..!

 

అందం అభినయం ఉన్న ఈ అమ్మడికి సరైన ఛాన్సులు రావట్లేదని చెప్పాలి. చిత్రలహరి, బ్రోచేవారెవరురా సినిమాల్లో నటించిన ఈ అమ్మడు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో స్పెషల్ ఎట్రాక్షన్ కానుందని తెలుస్తుంది. అల్లు అర్జున్ తో చేస్తుంది కాబట్టి ఇక మీద ఆమెకు స్టార్ అవకాశాలు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఈ సినిమాలో నివేదా పేతురాజ్ సుమంత్ కు జోడీగా కనిపిస్తుందట.

 

2020 జనవరి 12న రిలీజ్ అవనున్న అల వైకుంఠపురములో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా సెన్సేషనల్ హిట్టు కొట్టాలని చూస్తున్నాడు బన్ని. ఇప్పటికే రిలీజైన 3 సాంగ్స్ సూపర్ హిట్ అవగా బుధవారం ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన అర నిమిషం టీజర్ గ్లింప్స్ కూడా సూపర్ గా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: