నువ్వు నేను సినిమాలో హీరోయిన్ గా నటించిన అందాల భామ అనిత మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఉదయ్ కిరణ్ తోనే రెండు మూడు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు కెరియర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసి మ్యారేజ్ చేసుకుంది. పెళ్లి తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చిన ఈ అమ్మడు తెలుగులో చివరగా మనలో ఒకడు సినిమాలో నటించింది. పెళ్లి తర్వాత హీరోయిన్ గా కొనసాగించడం కష్టమే అనిత మాత్రం బాలీవుడ్ లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చింది.

 

ఇప్పటికి తన ఫ్యాన్స్ ను అలరించేందుకు ఫోటో షూట్స్ చేస్తున్న అనిత తన ఫోటో షూట్స్ అన్ని తన వాచ్ మెన్ తోనే తీయించుకుంటానని చెప్పి షాక్ ఇచ్చింది. వాచ్ మెన్ లోని ఫోటోగ్రఫీ టాలెంట్ గుర్తించిన అనిత అతన్ని తన పర్సనల్ ఫోటోగ్రాఫర్ గా వాడేసుకుంటుంది. అతనిలో ఉన్న టాలెంటే ఇప్పుడు అతని కెరియర్ కు ఉపయోగపడుతుందని అంటుంది అనిత. మాములుగా అయితే స్టార్ హీరోయిన్స్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ తో ఫోటో షూట్ పెట్టుకుంటారు.

 

అల్లు అర్జున్ అల్లాడించేస్తాడు.. ఆ స్పీడ్ తట్టుకోవడం కష్టమే..!

 

కాని అనిత మాత్రం అందరికన్నా డిఫరెంట్ గా తన వాచ్ మెన్ తో ఫోటో షూట్ చేయించుకుంది. రీసెంట్ గా జీ అవార్డ్స్ కు గెస్ట్ గా వచ్చిన అనిత తను రెడీ అవగానే వాచ్ మెన్ తో ఫోటో షూట్ చేయించుకుని వచ్చింది. ప్రస్తుతం వాచ్ మెన్ ఫోటో షూట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సరైన ఛాన్స్ వస్తే ఇప్పటికి సినిమాల్లో నటిస్తానని చెబుతున్న అనిత తనకు పాత్ర నచ్చాలని అంటుంది.

 

ఒకప్పటి హీరోయిన్స్ అంతా ఇప్పుడు మళ్లీ వరుసగా సినిమాలు చేస్తున్నారు. అయితే అనిత మాత్రం తనకు ఎలాంటి పాత్ర ఇచ్చినా చేస్తా కాని సినిమాకు ఆ పాత్ర చాలా ఇంపార్టెంట్ అయ్యుండాలని అంటుంది. మదర్ రోల్స్ కు ఇప్పుడే సూట్ అవదు కాబట్టి అక్క, వదిన పాత్రలకు అనిత పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: