బుల్లితెరపై హీరోల రేంజ్ లో క్రేజ్ సంపాదించిన కమెడియన్ సుడిగాలి సుదీర్. ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షోలో సాదాసీదా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఏకంగా టీం లీడర్ గా మారిపోయాడు. జబర్దస్త్ లో ఎంతోమంది టీం లీడర్లు మారుతున్నప్పటికీ సుడిగాలిసుధీర్ మాత్రం తన సత్తా చాటుతూ నవ్వుల పువ్వులు పోలుస్తూ తన హవా నడిపిస్తున్నాడు. అయితే ఒక కామెడీ లోనే కాకుండా అటు యాంకరింగ్ లో కూడా వివిధ షోలు చేస్తూ అందరినీ మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇక మరోవైపు మ్యాజిక్ షోలు చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు సుడిగాలి సుధీర్. ఇక ఈ టీవీలో ప్రసారమయ్యే డీ షో లో ఓవైపు కామెడీ చేస్తూనే మరోవైపు తన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో ఇరగదీస్తాడు. 

 

 అయితే ప్రస్తుతం సుడిగాలి సుధీర్ సాఫ్ట్వేర్ సుదీర్ అనే సినిమాలో ఏకంగా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాలో తన పర్ఫామెన్స్ లతో అదరగొడుతున్నాడు సుడిగాలి సుదీర్. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలకు సుడిగాలి సుధీర్ డాన్స్ పర్ఫామెన్స్ లతో దుమ్ము లేపుతున్నాడు. ఇక  ఈ సినిమాలో సుడిగాలి సుదీర్ సరసన హీరోయిన్ గా రాజుగారి గది ఫెమ్  ధన్య బాలకృష్ణ నటిస్తోంది. అయితే  తాజాగా ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన సుడిగాలి సుదీర్ త్వరలో విడుదల కాబోతున్న తన సాఫ్ట్వేర్ సుధీర్ సినిమా  గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

 

 

 ముందుగా సాఫ్ట్వేర్ సుదీర్ సినిమాలో  హీరోయిన్ పాత్ర కోసం ధన్యా బాలకృష్ణను  చిత్రబృందం సంప్రదిస్తే కొత్తవాళ్లతో తాను సినిమా చేయనని పేరున్న  వాళ్ళతో మాత్రమే చేస్తానంటూ చెప్పిందట . అయితే ఈ సినిమా లో సుడిగాలి సుదీర్ హీరో అనే విషయాన్ని బెంగళూరులోని తన స్నేహితులతో ఓ  సమయంలో ప్రస్తావించగా... వాళ్ళంతా  సుడిగాలి సుధీర్ కి మంచి క్రేజ్ ఉందని సినిమా చేయమని ధన్య బాలకృష్ణ కు సలహా ఇచ్చారట. దీంతో ధన్య బాలకృష్ణ సాఫ్ట్వేర్ సుదీర్ సినిమా చేయడానికి ఒప్పుకుందట. ఈ విషయం హీరోయిన్ ధన్య బాలకృష్ణ తనకు స్వయంగా చెప్పిందని సుడిగాలి సుదీర్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ షో  ద్వారా తన రియల్ లైఫ్ కి  సంబంధించి పలు ఆసక్తికర విషయాలను కూడా వెల్లడించారు సుదీర్ . ప్రస్తుతం సుడిగాలి సుదీర్ త్రీ మంకీస్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: