ఒకప్పుడు జబర్దస్త్, ప్రస్తుతం ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలో స్పెషల్ ఎట్రాక్షన్ ఎవరంటే... రష్మీ గౌతమ్ అని ఇట్టే చెప్పొచ్చు. ప్రతి శుక్రవారం ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ నవ్వులు విందుకు స్వాగతం పలికే యాంకర్ రష్మి హాట్ లుక్స్‌తో దర్శనం ఇస్తోంది. ఇటు జ‌బ‌ర్ద‌స్త్ మాత్ర‌మే కాకుండా అటు ఢీ షోలో కూడా ఓ ఊపు ఊపేస్తుంది. వాస్త‌వానికి  ఢీ, జబర్దస్త్ షోలతో బుల్లితెర ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ఈమె గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇక బుల్లితెరపై హాట్ యాంకర్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు రష్మి.. కేవలం యాంకర్‌గానే కాకుండా వెండితెరపై హీరోయిన్‌గానూ ప్రయత్నిస్తుంది.

 

అయితే ఇప్పటి వరకు 20కి పైగా సినిమాల్లో నటించినా రష్మి పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అందాలు ఆరబోస్తున్నా సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో రష్మికి అవకాశాలు రావడంలేదు. అయినప్పటికీ, ఆమెకు యూత్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎందుకంటే, సోషల్ మీడియా ద్వారా తనకు తాను చేసుకునే ప్రచారం అలాంటిది. ఎంద‌రో అభిమానుల‌ను సంపాదించుకున్న రెష్మీ.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతీ అంశాన్నీ తన ఫ్యాన్స్, ఫాలోయర్లతో పంచుకుంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తోంది. 

 

ఇక మ‌రోవైపు నాగ‌బాబు జ‌బ‌ర్ద‌స్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ నుండి త‌ప్పుకోవ‌డంతో.. ఆ రెండు షోల రేటింగూ పడిపోకుండా చూసుకునే బాధ్యతను జడ్జి, ఎమ్మెల్యే రోజా, యాంకర్లు అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్‌తోపాటూ... టీమ్ లీడర్లు నెత్తికెత్తుకున్నారు. అందుకోసం టీమ్‌లలో చేసిన మార్పులూ, చేర్పులూ మొత్తానికి జబర్దస్త్ షోను అలాగే నిలబెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో రెష్మీ సోష‌ల్ మీడియాలో రూటు మార్చింది. తన వంతుగా జబర్దస్త్ షో రేటింగ్ పెంచేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుల శైలిని మార్చింది. ఇదివరకు సింగిల్ ఫొటోలను మాత్రమే షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మల్టిఫుల్ ఫొటోలను అసెంబ్లింగ్ చేసి సింగిల్ ఫొటోగా షేర్ చేస్తోంది. వీటిలో రష్మీ ఒకే సందర్భంలో వేర్వేరు ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ.. ఎన‌ర్జిటిక్‌గా కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ పిచ్చెక్కిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: