బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకునే నటిస్తున్న తాజా చిత్రం ఛపాక్‌.  బిగ్ బడ్జెట్ సినిమాల్లోనే కాకుండా డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ దీపికా పదుకొనె.  ప్రస్తుతం ఈ అందాల బామ యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా తీస్తున్నబయోపిక్ లో నటిస్తున్నారు. ఈ సినిమాని డైరెక్టర్‌ మేఘనా గుల్జార్‌ తెర కెక్కిస్తున్నారు. 

 

నేటి వరకు ఎవరూ నటించని ఓ ప్రయోగాత్మక క్యారెక్టర్ లో దీపిక నటిస్తున్నారు. యాసిడ్ దాడికి గురైన మహిళ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొంటోందో ఈ సినిమాలో చూపిస్తారు. లక్ష్మీ గా దీపిక ఈ సినిమాలో తన నటనతో మన కంట కన్నీరు తెప్పించనుంది. ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు.  సినిమాలో దీపిక కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిందని ట్రైలర్ చూసి చెప్పొచ్చు.  ప్రస్తుతం ఈ  ట్రైలర్ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

 

ఇక ఈ సినిమాలో దీపికా లుక్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ మూవీలో దీపికా లక్ష్మీ అగర్వాల్‌లానే కనిపించడంతో పాటు..ఆమె హావభావాలు కూడా అచ్చం అలానే ఉన్నాయని అంటున్నారు దర్శకురాలు మేఘనా గుల్జార్‌. ఈ చిత్రంలో దీపిక నటన గత సినిమాలకు భిన్నంగా ఉంటుందని..ఆమెను మరో స్థాయికి చేరుస్తుందని తెలిపారు.


15 ఏళ్ల వయసులో  యాసిడ్ దాడికి గురైన లక్ష్మి అగర్వాల్ పాత్రను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. స్టాప్ సేల్ యాసిడ్ అనే నినాదంతో యాసిడ్ ల విక్రయాన్ని ఆపేసిన ఘనత ఆమెది. అప్పటి  నుంచి యాసిడ్ ఘటనలు తగ్గాయి. తనను ప్రేమించలేదని నయీమ్ ఖాన్ అనే వ్యక్తి లక్ష్మిపై యాసిడ్ దాడి చేశాడు. అయితే ఎంతో మనోవేధనలో కూడా లక్ష్మి దైర్యంగా నిలబడి కొత్త తరహాలో జీవితాన్ని గెలిచి అందరికి ఆదర్శంగా నిలిచింది.

 

యాసిడ్ దాడులు జరగకుండా అమ్మకాలను నిరోదించిన మహిళ లక్ష్మి. అలాంటి పాత్రలో ఇప్పుడు దీపిక నటించి తన నటనతో అందర్ని ఆకట్టుకోనుంది. రాజి సినిమాతో దర్శకురాలిగా మంచి ప్రశంసలు అందుకున్న మేఘన గుల్జర్ ఆ సినిమాను తెరకెక్కించనున్నారు. మరి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చన ఈ సినిమాను ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారో వేచిచూద్దాం...

మరింత సమాచారం తెలుసుకోండి: