ఎంతో కష్టపడి సినిమా తీస్తారు. మొదలు అయ్యేదగ్గరనుంది విడుదల అయ్యే వరకు ఎన్నో సమస్యలు.. సినిమాని పైరసి నుండి, లీక్స్ నుండి కాపాడాలంటే అందరికి కత్తి మీద సాము లాంటిది... ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటే గాని మూవీ రిలీజ్ అవ్వదు.

అలాంటి మూవీ లీక్ ఇప్పుడు ప్రముఖ సిని వెబ్ సైట్ లలో హల్చల్ చేస్తుంది.. ఈ నెల 13 న వెంకటేష్ పుట్టినరోజు కానుకగా వెంకిమామ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు. వెంకటేష్ సరసన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, నాగ చైతన్య సరసన రాశి  ఖన్నా హీరియిన్స్ గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్, తమన్ ఇద్దరు కలిసి బాణీలు సమకూర్చారు..

సినిమా టీజర్ ఇప్పటికే చాలా మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. కాని ఒక్కసారిగా సినిమా స్టోరీ అంతా లీక్ అయింది. దీనితో అందరు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. పైగా ఈ సినిమా  స్టోరీని లీక్ చేసింది మాత్రం ప్రముఖ సినీ టికెట్ బుకింగ్ వెబ్ సైట్ కావడం అనుమానాలకు దారితీస్తుంది.


స్టోరీ లైన్ చూస్తే "చిన్నప్పుడే తల్లి తండ్రులని కోల్పోయిన నాగ చైతన్య బాధ్యతలని మేనమామ అయినా వెంకీ తీసుకుంటాడు. వెంకటేష్ నాన్న జాతకాన్ని చుయించడానికి జ్యోతిషుడు దగ్గరకి వెళ్తాడు.. అక్కడ ఒక షాకింగ్ విషయం తెలిసి వెంకటేష్ తండ్రి అయోమయం లో పడతాడు.
పెరిగి పెద్దయ్యాక ఎప్పటికయినా మేనమామ ప్రాణం మేనల్లుడు చేతిలో పోతుంది అని చెప్తాడు. అది తెలిసి కూడా మేనమామ మేనల్లుడు ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు..అనేది ఈ సినిమా స్టోరీ లైన్..

 


సినిమా పై వచ్చిన అప్ డేట్స్ తో ఒక్కసారి గా మూవీ పై హైప్ పెరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరిగిందని, ఆంధ్ర ఏరియాలో 17 వేల కోట్ల బిసినెస్ చేసిందని, అలాగే ప్రపంచం వ్యాప్తంగా 37 వేల నుంచి 40 వేల కోట్ల బిజినెస్ చేసిందని టాక్. ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: