ఖైదీ నెంబర్ 150 తరువాత ఈ దసరా కు  సైరా నర్సింహా రెడ్డి  తో ప్రేక్షకులముందుకు వచ్చాడు  మెగా స్టార్ చిరంజీవి.  ఈఏడాది మచ్ అవైటెడ్ సినిమాల్లో  ఒకటిగా విడుదలైన  సైరా పాజిటివ్  రివ్యూస్  తో పాటు మంచి  టాక్ ను  కూడా  తెచ్చుకుంది కానీ   కలెక్షన్ల విషయం లో మాత్రం నిరాశపరిచింది.  భారీ బడ్జెట్ తో నిర్మించడం వల్ల ఈ చిత్రాన్ని  భారీ రేట్లకు  అమ్మారు. దాంతో టాక్ బాగున్నా కొన్ని ఏరియాల్లో  బ్రేక్ ఈవెన్ కాలేదు. తొలి తరం స్వాతంత్ర సమరయోధుడు  ఉయ్యాలావాడ  నర్సింహారెడ్డి  జీవిత కథ  ఆధారంగా  సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. 
 
 
ఇక ఈ చిత్రం తరువాత చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్  కొరటాల శివ  తో  తన 152 వ చిత్రాన్ని చేయనున్నాడు. ఇటీవలే ఈచిత్రం పూజా కార్యక్రమాలతో లాంచ్ కూడా అయ్యింది.  ప్రస్తుతం  ఈ సినిమా మ్యూజిక్ సెట్టింగ్స్  జరుగుతున్నాయి. సోషల్ మెసేజ్ కి కమర్షియల్  అంశాలను  జోడించి  సినిమాలు  తెరకెక్కించడం లో  కొరటాల శివ దిట్ట. ఇప్పటివరకు ఆయన  డైరెక్ట్ చేసిన చిత్రాలు  అన్ని ఇదే ఫార్ములా  తో  వచ్చినవే. అవన్నీ కూడా సూపర్ హిట్లు అయ్యాయి. తాజాగా  చిరు సినిమా ను కూడా  అదే  విధంగా  తెరకెక్కించనున్నాడట. ఇక ఈ చిత్రానికి 'ఆచార్య'  అనే టైటిల్ ను పెట్టనున్నట్లు  ఫిలిం నగర్  నుండి వార్తలు వస్తున్నాయి.  డిసెంబర్ 26న  కోకాపేట లోని చిరు ఫామ్ హౌస్ లో సినిమాను మొదలు పెట్టనున్నట్లు గా తెలుస్తుంది. అలాగే మొదటి షెడ్యూల్ ను హైదరాబాద్ లో జరిపి రెండో షెడ్యూల్ ను  రాజమండ్రి తదితర ప్రాంతాల్లో  షూట్ చేయనున్నారని సమాచారం. మ్యాట్నీ ఎంటర్ టైమెంట్స్ , కొణిదెల ప్రొడక్షన్స్  నిర్మించనున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: