తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 3. గత నవంబరులో ఈ షో ముగియడంతో హౌస్ మేట్స్ అందరూ ప్రస్తుతం బయట సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేస్తూ తమ ఆనందాన్ని వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. హౌస్ లోకి వెళ్ళిన ప్రతి సభ్యుడు ప్రస్తుతం బయట సెలబ్రిటీ లెవెల్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా షో జరుగుతున్నంతసేపు రొమాంటిక్ జంటగా తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను అలరించిన జంట రాహుల్ - పునర్నవి ల జంట. ఇంట్లో ఉన్నంత సేపు రాహుల్ కి అండగా ఉంటూ ఎంతో సపోర్టు ఇచ్చిన పునర్నవి ఆమె ఇంటి నుండి వెళ్ళిపోయిన సందర్భంలో రాహుల్ తీవ్ర కన్నీటిపర్యంతమైన ఎపిసోడ్... ఇప్పటికీ బిగ్ బాస్ అభిమానులు ప్రేక్షకులు మర్చిపోలేని ఎపిసొడ్ గా నిలిచిపోయింది.

 

ఇద్దరు బిగ్ బాస్ హౌస్ లో మంచి స్నేహితులుగా మెలగటం తో వారిద్దరిపై అనేక వార్తలు రూమర్లు సోషల్ మీడియాలో అప్పట్లో బిగ్ బాస్ రియాల్టీ షో లో జరుగుతున్న సందర్భంలో రావటం జరిగాయి. అయితే షో విన్నర్ గా రాహుల్ గెలవడంతో ప్రస్తుతం రాహుల్ బయట మంచి ఎంజాయ్ చేస్తూ మ్యూజిక్ షోలు నిర్వహిస్తూ అభిమానులను ఎంతగానో అలరిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇంటి సభ్యులతో కలిసి కూడా ఇటీవల మ్యూజిక్ షోలు రాహుల్ నిర్వహించడం జరిగింది.

 

ఇదిలా ఉండగా తాజాగా పునర్నవితో తాను తీసుకున్న ఫొటోను షేర్ చేసిన రాహుల్.. ఆమె గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘తెలియని వ్యక్తిగా వచ్చి మంచి స్నేహితురాలిగా మారావు. బిగ్‌బాస్ జర్నీలో నువ్వు నాకు చాలా సపోర్ట్ ఇచ్చావు. ఎప్పటికీ గుర్తుండిపోయే ఙ్ఞాపకాలు ఇచ్చావు’’ అని రాసుకొచ్చాడు. అంతటితో ఆగకుండా ‘‘ఇంక సాలు తీ.. మస్తైంది ఇక సల్లవడు నవి’’ అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో తామిద్దరం మంచి స్నేహితులమే అన్నట్లుగా మరోసారి క్లారిటీ ఇచ్చాడు రాహుల్. 

మరింత సమాచారం తెలుసుకోండి: