పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ హీరో గా ఎంట్రీ ఇచ్చినా విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్ సెన్సేషన్ హీరోగా మారిపోయాడు. ఇక తన ఆటిట్యూడ్,  మాటలతో  ప్రేక్షకులందరికీ ఐకాన్ గా మారిపోయాడు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. ఆ తర్వాత వరుస విజయాలను సొంతం చేసుకుంటూ స్టార్ హీరోలకు రేస్ lo చేరుకునేందుకు తహతహలాడుతున్నాడు . ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ కి వచ్చి  ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. గీత గోవిందం విజయంతో  ఏకంగా వంద కోట్ల హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. 

 


 ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాలో నటిస్తున్నారు. సినిమా ఇంకొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లుక్  కూడా కాస్త డిఫరెంట్గా కనిపిస్తుండడంతో ఎప్పుడు ఎప్పుడు ఈ సినిమా విడుదల కాబోతుందా అని టాలీవుడ్ ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలు సైన్ చేసి బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం తర్వాత ఐస్మార్ట్ శంకర్ మూవీ తో ఊపు మీదున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ తో తన తర్వాత సినిమా చేయనున్నాడు విజయ్ దేవరకొండ. 

 

ఈ సినిమాకు ఫైటర్గా టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు  పట్టాలు ఎక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే పూరి సినిమాకి పాన్  ఇండియా స్థాయిని తీసుకువచ్చే క్రమంలో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ను  నిర్మాణ భాగస్వామిగా చేసుకున్నాడు కూడా చేసుకున్నారురు. అయితే ఫైటర్ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ హీరోయిన్ నటిస్తే బాగుంటుందని పూరి జగన్నాథ్ భావిస్తున్నారట... హీరోయిన్స్ సెలక్షన్ మేటర్ మొత్తం కరణ్  జోహార్  కి  అప్పగించారట పూరి. దీంతో అటు కరణ్  జోహార్  బాలీవుడ్లో డేట్స్  ఎవరిది ఖాళీగా ఉన్నాయని వెతుకుతున్నారట . ప్రస్తుతం జాన్వికపూర్, సారా అలీ ఖాన్,  ఆలియా భట్ డేట్స్ అందుబాటులో ఉండగా ఆలియాభట్ ని ఈ సినిమాలో ఎంపిక చేస్తారు అని టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: