ఇటీవల టాలీవుడ్ బడా నిర్మాత సి.కళ్యాణ్ 60వ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ నగరంలో హోటల్ తాజ్ కృష్ణ లో చాలా గ్రాండ్ గా జరిగాయి. ఈ పుట్టినరోజు వేడుకలకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి చాలా మంది ప్రముఖులు హాజరు కావడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి అదేవిధంగా నందమూరి బాలకృష్ణ ఈ వేడుకకు హాజరు అయ్యి నిర్మాత సి.కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఇంకా చాలా మంది సీనియర్ హీరోలు మరియు అదే విధంగా ఇతర ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కూడా ఈ వేడుకకు హాజరు అయ్యి సి.కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ వేడుకలకు బుల్లితెర ప్రముఖ యాంకర్ హాజరయ్యి పార్టీలో ఫుల్లుగా తాగి ప్రతి ఒక్కరితో జన్మదిన వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్క సెలబ్రిటీలతో సెల్ఫీ దిగి రచ్చ రచ్చ చేసింది అని ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.

 

అంతేకాకుండా ఈ బుల్లి తెర యాంకర్ ఇటీవల వెండితెరపై కూడా నటిస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించినట్లు ముందుగా కెరియర్ యాంకర్ తో స్టార్ట్ చేసి ప్రస్తుతం సినిమాల్లో కూడా నటిస్తూ అత్యధిక లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా జరిగిన సి.కళ్యాణ్ 60వ పుట్టినరోజు వేడుకలలో ఈమె చేసిన హడావిడి చూసి వేడుకకు వచ్చిన చాలామంది ప్రముఖులు ఆశ్చర్యపోయి నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

 

మామూలుగా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఎక్కువగా వీకెండ్స్‌లో గానీ, పార్టీల్లో గానీ మద్యం సేవించడం సహజం. కానీ అది కాస్తా ఓవర్ డోస్ అయితే మాత్రం.. పరిస్థితులు తారుమారవుతాయని గుర్తుంచుకోవాలి. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలామంది సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ వార్త విని ఎవరు ఆ యాంకర్ అయి ఉంటారు అన్న చర్చలు చేపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: