నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో V అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమాలో నటించబోతున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత నాని టాక్సీవాలా సినిమా డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా నాని నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అవుతున్నాయి. 
 
నాని నటించిన కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లు కాగా జెర్సీ సినిమాకు హిట్ టాక్ వచ్చినా భారీ కలెక్షన్లు మాత్రం రాలేదు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా కూడా నానికి నిరాశనే మిగిల్చింది. మరోవైపు రాహుల్ సాంకృత్యాన్ టాక్సీవాలా సినిమా తరువాత ఇప్పటివరకు ఏ సినిమా చేయలేదు. 4 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన టాక్సీవాలా సినిమా 20 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను రాబట్టింది. 
 
విడుదలకు ముందే పైరసీ బారిన పడిన టాక్సీవాలా విజయ్ దేవరకొండ కెరీర్ లో మంచి హిట్ గా నిలిచింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రాహుల్ దర్శకత్వంలో నాని హీరోగా సినిమా తెరకెక్కబోతుంది. నాని నటించబోయే టక్ జగదీష్ సినిమా పూర్తయిన తరువాత ఈ సినిమా మొదలవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం నాని ఇంద్రగంటి దర్శకత్వంలో నటిస్తున్న V సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. 
 
ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. వరుసగా నటించిన సినిమాలు  ఫ్లాప్ అవుతూ ఉండటంతో నాని దర్శకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తనకు అష్టాచమ్మా, జెంటిల్ మేన్ లాంటి హిట్లు ఇచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణకు నాని అవకాశం ఇచ్చాడు. తనకు నిన్నుకోరి హిట్ ఇచ్చిన శివ నిర్వాణ మజిలీ సినిమాతో మరో హిట్ ఇవ్వడంతో శివ నిర్వాణకు నాని అవకాశం ఇచ్చాడు. ఈ రెండు సినిమాల తరువాత తొలి సినిమాతోనే హిట్ కొట్టిన రాహుల్ సాంకృత్యాన్ కు అవకాశం ఇచ్చాడు. హిట్లలో ఉన్న డైరెక్టర్లు నానికి హిట్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: