నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ ముందునుంచి నిదానంగానే సాగుతోంది. ఎప్పుడో ఒక్క సూపర్ హిట్ పడితే ఆ తర్వాత సినిమాలు యావరేజ్ గా ఆడి సరిపెట్టుకుంటున్నాయి. అయినా కళ్యాణ్ రామ్ మాత్రం వరుసగా సినిమాలు చేయడానికే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ మధ్య వచ్చిన 118 సినిమాతో సక్సస్ ని అందుకున్నాడు. ఆ వెంటనే ఒక ఫ్యామిలీ కథ తో రెడి అవుతున్నాడు. సతీష్ వేగేశ్న దర్శకత్వం లో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 'ఎంత మంచివాడవురా' సంక్రాంతి సీజన్లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే మహేష్ బాబు -అల్లు అర్జున్ సినిమాల పోటీతో సంక్రాంతి వేడెక్కింది. బడా స్టార్ హీరోలు.. భారీ చిత్రాల నిర్మాతలు కావడంతో థియేటర్లు ఈ రెండు సినిమాల కు ఎక్కువగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 

 

దీంతో సంక్రాంతి కి రిలీజ్ కానున్న ఇతర సినిమాల పై ఈ ఎఫెక్ట్ పడుతోందని టాక్. వాస్తవంగా చూస్తే ఈ సంక్రాంతికే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మురగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన దర్బార్ కూడా రాబోతోంది. ఆ ప్రభావం కూడా కళ్యాణ్ రామ్ సినిమా మీద పడనుంది.  మహేష్ - అల్లు అర్జున్ సినిమాల పోటీ వల్ల 'ఎంత మంచివాడవురా' సినిమాకు మొత్తం మీద మహా అయితే 300  థియేటర్లు దొరకడమే కష్టం అని.. 300 లోపే ఆ నంబర్ ఉంటుదని అంటున్నారు. 300 థియేటర్లు దొరకడమే గగనం అనుకుంటే ఈ సినిమా మరో విషయంలో కూడా జనాల దృష్టిని ఆకర్షించలేకపోతోంది. మహేష్ - బన్నీ సినిమాలు ప్రమోషన్స్ లో ముందంజలో ఉన్నాయి. కానీ కళ్యాణ్ రామ్ సినిమా ప్రచారం నీరసం గా ఉంది. 

 

కళ్యాణ్ రామ్ సినిమా నుంచి రీసెంట్‌గా ఒక లిరికల్ సాంగ్ విడుదల చేశారు.. అయితే ఆ పాట ఏంటి.. పాట రిలీజ్ అయిన విషయం ఎంత మందికి తెలుసు అనే ప్రశ్నలు వేసుకుంటే కళ్యాణ్ రామ్ సినిమా ప్రమోషన్లు ఎంత వీక్ గా ఉన్నాయో అందరికి అర్థమవుతోంది. సంక్రాంతి పోటీలో రిలీజ్ చేస్తున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ విషయంలో శ్రద్ధ పెట్టకపోతే తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అందుకే కొంతమంది కళ్యాణ్ రామ్ ని తొక్కేస్తున్నారా అంటు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే కళ్యాణ్ రామ్ నటించబోయే కొత్త సినిమా సైలెంట్ గా ప్రారంభోత్సవం జరుపుకుంది. సోషియో ఫ్యాంటసీ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను రీసెంట్‌గా లాంచ్ చేశారని సమాచారం. ఈ సినిమా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కనుందని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: