ట్యూన్ కు పాట రాయడం అన్నది చాలా కాలంగా తెలుగులోనే కాదు అన్ని భాషల సినిమా సంగీతంలో అలవాటైపోయిన వ్యవహారం. 1980 కాలం నుంచి అందరు ఇదే ఫాలో అవుతున్నారు. ఈ పద్దతి  రచయితలకు సులువు అని కొందరు, కష్టం అని కొందరు అంటుంటారు. మ్యూజిక్ డైరక్టర్లు మాత్రం ఇలా చేయడం వల్ల మాంచి క్యాచీ ట్యూన్ లు ఇవ్వొచ్చు అనే అభిప్రాయం చాలామందిలో వుంది.  ఇక 'సరిలేరు నీకెవ్వరు'.. మహేష్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా. ఈ సినిమా రీసెంట్‌గా నుంచి సెకెండ్ సింగిల్ బయటకు వదిలారు చిత్ర బృందం. మెలోడియస్ గిటార్ బిట్ తో పాట స్టార్ట్ అయింది. 'సూర్యుడివో..చంద్రుడివో..ఆ ఇద్దరి కలయికవో' అంటూ హీరో ఎలివేషన్ సాంగ్ ను ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి రచించారు. బి ప్రాక్ పాడిన ఈ పాటలో రెండు మూడు రకాల ట్యూన్ లు వినిపించారు దేవీశ్రీ ప్రసాద్. 

 

పాటలో చరణం ఎత్తుగడ, నడక, మళ్లీ పైకి లేవడం అనే టెక్నిక్ లో మధ్యన నడక దగ్గరకు వచ్చేసరికి ట్యూన్ లో ఉండాల్సిన అట్రాక్టివ్ నెస్ లోపించింది. పాట మొత్తం కొత్త ఇనుస్ట్రుమెంటేషన్ వినిపించాడు. అది బాగుంది. కానీ ఎప్పుడయితే..పాట మధ్యలో ''...గుండెలోతులో గాయం..నువ్వు తాకితే మాయం..మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సాయం''..అలాగే...''..దేవుడెక్కడో లేడు..వేరే కొత్తగా రాడు..మంచి మనుషులలో గొప్ప మనసు తానై వుంటాడు నీలా...''అన్న దగ్గర వింటే ఈ సమస్య తెలుస్తుంది. దీనివల్ల దేవీ ట్యూన్ ఇవ్వకుండా, రఫ్ ట్యూన్ ఇచ్చి, రామజోగయ్య రాసిన తరువాత ట్యూన్ చేసారేమో అన్న అనుమానం కలుగుతోంది.

 

దీని వల్ల పాట మొత్తం కొత్త ఇనుస్ట్రుమెంటేషన్ వున్నా, మెలోడీ టచ్ ఇచ్చినా, ట్యూన్ దగ్గర క్యాచీనెస్ తగ్గినట్లు అనిపిస్తుంది. మరి జనాలకు ఎంత వరకు రీచ్ అవుతుందో చూడాలి. పాట ఇనుస్ట్రుమెంటేషన్, సాహిత్యానికి తగినట్లు విడియోలో జోడించిన విజువల్స్ బాగానే వున్నాయి. అవి ఈ పాటవి కావచ్చు... లేదా సినిమాలోవి కావచ్చు. మొత్తం మీద ప్లెజెంట్ గా వున్నాయి. కానీ మొత్తంగా చూస్తుంటే జనాలకి కాస్త డిసప్పాయింట్ తప్పడం లేదు. దేవీ నుంచి ప్రేక్షకులు ఏదో ఆశిస్తుంటే ఇంకేదో అవుతోంది. 'అల' నుంచి వచ్చిన రెండు పాటలు కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యాయి. ట్రెండింగ్ అయ్యాయి. కానీ సరిలేరు నుంచి వచ్చిన ఈ పాట మాత్రం అంత ఫాస్ట్ గా దూసుకెళ్ళడం లేదు. ఈ ఫెల్యూవర్ దేవీశ్రీ దే అని కొందరు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: