ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ చెప్పుకోదగ్గ స్టార్ హీరో. తెలుగు ఇండస్ట్రీ లో గొప్ప వ్యక్తి అయినా రామానాయుడు గారి తనయుడు గా సినిమాల్లో ప్రవేశం చేసి తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు.. విక్టరీ అనే బిరుదును సంపాదించాడు.

ఎన్నో సినిమాల్లో నటించాడు.. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గర అయ్యాడు. వయసు పెరిగే కొద్దీ తనకి నప్పే పాత్రలు మాత్రమే సరిగా ఎంచుకుని మూవీస్ ప్లాన్ చేసుకుంటారు.. ఇప్పటి హీరోల్లో మల్టీ స్టార్ మూవీ అంటే ముందుగా గుర్తు వచ్చేది మన వెంకటేష్.


ప్రస్తుతం వెంకటేష్ తన మేనల్లుడు అయిన నాగచైతన్య తో "వెంకిమామ "అనే మల్టీస్టార్ మూవీ చేస్తున్నారు. అది కూడా మరొక రెండు రోజులలో విడుదలకి సిద్ధం అవుతుంది.  విడుదల రోజే వెంకటేష్ పుట్టినరోజు కావడం విశేషం.. ఈ భారీ మల్టీ స్టార్ సినిమా మీద మామ అల్లుడు బాగా ఆశలు  పెట్టుకున్నారు.. సినిమా పై వచ్చిన హైప్ అలాంటిది మరి.. వెంకటేష్ తన కెరీర్ లో చాలానే మల్టీ స్టార్ మూవీలు చేసారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల, మసాలా, రీసెంట్ హిట్ f2 సినిమాల్లో నటించారు. ఇపుడు వెంకి మామ లో నటిస్తున్నారు.

వెంకటేష్మూవీ తర్వాత "అసురన్ " రిమేక్ లో నటించనున్నారు.. తమిళంలో సూపర్ స్టార్ ధనుష్ నటించారు. అక్కడ ఈ మూవీ పెద్ద హిట్ అయినది.. ఆ మూవీ రీమేక్ లో తెలుగు వెర్షన్ లో వెంకటేష్ నటిస్తున్నారు.


ఇపుడు సరికొత్తగా వెంకటేష్ మరొక మల్టీస్టార్ మూవీలో నటించబోతున్నారు అనే వార్త వెలువరింది. రచయత ఆకుల శివ తాజాగా ఒక స్క్రిప్ట్ ని సురేష్ బాబుకి వివరించారట. ఆ కధకి వెంకటేష్ అయితే న్యాయం చేయగలరని ఇద్దరు అబిప్రాయాపడ్డారట.. వెంకటేష్ తో పాటు మరొక యంగ్ స్టార్ కూడా నటిస్తే బాగుంటుంది అని అనుకున్నారట.


వెంకటేష్ పక్కన నటించే మరో హీరో ఎవరో కాదు నాచురల్ స్టార్ హీరో "నాని " అని ప్రచారం జరుగుతుంది. తన సహజమయిన నటనతో ఎంతోమంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్న హీరో నాని. వీళ్ళద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి!! నాని ప్రస్తుతం  వీ, టక్ జగదీష్ మూవీలో నటిస్తున్నారు.. అలానే వెంకటేష్ "అసురన్ "రీమేక్ కంప్లీట్ అయ్యాక వీళ్లిద్దరి కాంబినేషన్ లో మూవీ 2021 లో స్టార్ట్ అయిదేమో అనే ప్రచారణ జరుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: