ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు అని ఇండస్ట్రీలో వేయికళ్ళతో ఎదురు చూస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్.  దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఇది. అంతేకాకుండా ఈ సినిమాలో టాలీవుడ్ సూపర్ స్టార్స్ అయిన జూనియర్ ఎన్టీఆర్... రామ్ చరణ్ నటిస్తున్నారు.దీంతో  ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. సినిమా గురించి ఏ చిన్న లీక్  బయటకు వచ్చిన అదీ  ప్రస్తుతం సంచలనంగా మారిపోతుంది. ఆంగ్లేయుల పై పోరాటం చేసిన వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు . అయితే చరిత్రలో ఎన్నడూ కలవని స్వతంత్ర సమరయోధులు అయిన కొమరం భీం సీతారామరాజులు  కలిస్తే ఎలా ఉంటుందనే దానిపై కాల్పనిక కథతో ఆర్.ఆర్.ఆర్ సినిమా తెరకెక్కుతోంది. 

 

 

 

 ఓటమెరుగని దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో  రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్  సినిమా పై ఒక రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన చిన్న చిన్న లీక్ lu1 కూడా సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో షేక్ చేసాయి . అయితే ఈ సినిమాలో కొమరం భీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను చూసి అభిమానులు తెగ సంబరపడిపోయారు. ఇక ఆర్.ఆర్.ఆర్ సినిమా నుంచి తాజాగా ఎన్టీఆర్ నటిస్తున్న కొమరం భీమ్ పాత్రకు సంబంధించి ఓ వీడియో లీక్  సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అంతేకాకుండా ఎన్టీఆర్ పాత కు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. 

 

 

 

 ఈ ఫోటోలలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా ఒదిగి పోయినట్లుగా కనిపిస్తున్నాడు ఎన్టీఆర్ . కొమరం భీమ్ పాత్రలో కనిపిస్తున్న ఎన్టీఆర్ ముఖంలో రాజసం.. చుట్టూ జనానికి ఆంగ్లేయులపై పోరాటానికి ఆయన సూచనలు చేస్తున్నట్లుగా ఈ ఫోటోలలో జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ అనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్  చిత్ర షూటింగ్ నుంచి విడుదలైన వీడియో ను  ఫోటోలని  చూసి అభిమానులు కూడా తెగ సంబరపడిపోతున్నారు. ప్రతిష్టాత్మకంగా తమ అభిమాన హీరో నటించిన సినిమాకు సంబంధించిన ఫోటోలు వీడియోలు లీక్ సోషల్ మీడియాని తెగ హల్చల్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: