దర్శక ధీరుడు ఎస్ఎ.స్.రాజమౌళి దర్శకత్వంలో తాజాగా జూనియర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'ఆర్.ఆర్.ఆర్. జక్కన్నసినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో రిలీజ్ కావడంతో ఆ వీడియో ప్రస్తుతం అన్నీ సైట్స్ లో వైరల్ కావడంతో రాజమౌళి సినిమా యూనిట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సినిమా షూటింగ్ సమయంలో సినిమా యూనిట్ సభ్యులు ఎవరు కూడా సెల్ ఫోన్ వాడకూడదని ఈ సినిమాకి సంబంధించి ఒక్క ఫొటో కూడా బయటకు రాకూడని రాజమౌళి ముందుగానే యూనిట్ సభ్యులకు హెచ్చరించారన్న విషయం కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే.

 

ఇక తాజాగా లీక్ అయిన వీడియోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించాడు. అంతేకాకుండా ఒక ఉద్యమకారుడు తన పల్లె ప్రజల బాధలను అప్పటి జమీందారీ తనాన్ని ఎండగట్టే విధంగా పోరాటం చేసే ఉద్యమ సింహం స్టిల్ లో జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ఆకర్షణగా కనిపిస్తున్నాడు. ఇక బాహుబలి వంటి పాన్ ఇండియా సినిమా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా లీక్ అయిన వీడియోతో చిత్ర యూనిట్ పై రాజమౌళి చాలా కోపంగా ఉన్నారట. అంతేకాకుండా అసలు ఈ వీడియో తీసిన వాళ్ళు ఎవరు.. అర్జెంట్ గా తన దృష్ఠికి తేవాలని డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ కి వార్నింగ్ ఇచ్చినట్లు తాజా సమాచారం. 

 

మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే స్థాయిలో అసలు షూటింగ్ జరుగుతున్న సందర్భంలో ఆ చుట్టు పక్కన ఉన్న వ్యక్తులు ఎవరు అన్న విషయాన్ని ఆరా తీయాలని ఇంకా ఎన్ని వీడియోలు వాళ్ళ దగ్గర ఉన్నాయో అర్జెంట్‌గా ఆరా తీయాలని చిత్ర యూనిట్ సభ్యులకు ఎన్టీఆర్ వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఇలా ఆన్ లొకేషన్ నుండి వీడియో లీకవడం అంటే అది చిత్ర యూనిట్ సభ్యులే పొరపాటున తమ వాళ్ళకి పంపించి ఉంటారని అలా ఆ వీడియో లీకై ఉండొచ్చునని మరో ఆసక్తికరమైన వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. మరి ఈ వీడియో ఎలా లీకయిందో తెలియాలంటే రెండురోజులు ఆగాల్సిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: