భారతదేశ సినీ పరిశ్రమ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. భారీ మల్టీస్టారర్ మూవీగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమాకి మొదటి నుంచీ ఏదొక అవాంతరం వస్తూనే ఉంది. మొన్నామధ్య చిరంజీవి చరణ్ క్యారెక్టర్ గురించి చిన్న హింట్ ఇచ్చి లీక్ చేసాడు. ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ లుక్, షూటింగ్ లొకేషన్, ఎన్టీఆర్ లుక్, డైలాగ్.. క్రిస్టల్ క్లియర్ గా ఇంటర్ నెట్ లో లీక్ అయిపోయింది. 

 

 

ఎవరో ఒక తుంటరి చేసిన పనికి వందల కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీస్తున్న నిర్మాతకు ఇది పిడుగులాంటి వార్త. సినీ అభిమానులు.. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులకు షాక్ కు గురిచేస్తుంది. సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడా.. ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందో అనే ఆసక్తిని కొంతమంది ఆకతాయిలు నీరుగార్చేశారు. సినీ పరిశ్రమ మొత్తం షాక్ గురయ్యే ఇటువంటి కొంతమంది చేష్టలు ఎంతోమందిని బాధిస్తూంటాయి. ఇప్పటివరకూ ఎంతో పకడ్బందీగా సినిమా తీసిన రాజమౌళి ఔట్ డోర్ షూటింగ్ లొకేషన్ లో మరింత జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే విడుదల ఎప్పుడా.. అని సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. 

 

 

పవన్ అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ కాకుండా హై క్వాలిటీ ప్రింట్ బయటకొచ్చేసింది. టాలీవుడ్ మొత్తం దీనిపై షాక్ కు గురైంది. ఆ సంఘటనకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ వీడియో లీక్ కావడం నిజంగా బాధాకరం. ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు సంబంధించి.. అందునా ఎంతో సీక్రెట్ గా ఉండాల్సిన హీరో లుక్ వీడియోతో సహా లీక్ కావడం నిజంగా బాధాకరం. ఎంతో నిబద్దదతో, క్రమశిక్షణతో సినిమా తెరకెక్కించే రాజమౌళికి ఇది శరాఘాతం లాంటి వార్త అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: