మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల జబర్దస్త్ షో నుండి అర్ధాంతరంగా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపుగా ఏడేళ్లు ఆ షో కు జడ్జిగా వ్యవహరించిన నాగబాబు, ఆ షో లోని కొందరు నిర్వాహక సభ్యుల ప్రవర్తన  తనకు నచ్చకపోవడంతో షో నుండి బయటకు వచ్చినట్లు ఇటీవల ఒక వీడియో ద్వారా తెలిపారు. ఇక ఆ షో లో నుండి నాగబాబు తో పాటు అనసూయ మరియు చమ్మక్ చంద్ర కూడా బయటకు రావడం జరిగింది. అయితే వారితో పాటు సుడిగాలి సుధీర్, హైపర్ అది, గెటప్ శ్రీను కూడా బయటకు వస్తారని అందరూ భావించారు. అయితే నాగబాబు బయటకు వెళ్లడంతో కొంత జజాగ్రత్త పడిన మల్లెమాల టీమ్, 

 

మిగతా వారిని మాత్రం బయటకు వెళ్లకుండా గట్టి చర్యలు తీసుకుని వారిని బుజ్జగించడంతో పాటు, వారికి కొద్దిపాటిగా రెమ్యునరేషన్ కూడా పెంచినట్లు సమాచారం. ఇక నాగబాబు బయటకు వెళ్లిన తరువాత షోకు ఒకింత రేటింగ్స్ పై ప్రభావం పడుతుందని, అలానే షో కు యాంకర్ గా వ్యవహరించి ఆడియన్స్ ని ఆకట్టుకున్న అనసూయ కూడా లేకపోవడంతో షో కు రేటింగ్స్ కొంతవరకు తగ్గే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే అందరికీ షాక్ ఇచ్చేలా ఈ షో కు ఏ మాత్రం కొంచెం కూడా రేటింగ్స్ తగ్గ లేదని సమాచారం. ఈ షోకు గత వారం టిఆర్పి రేటింగ్స్ పరిశీలిస్తే, గత సీజన్లకు  వచ్చిన మాదిరిగానే వచ్చాయని, సో దీనిని బట్టి షో నుండి నాగబాబు గాని, 

 

లేదా అనసూయ గాని బయటకు వెళ్లినా ఎటువంటి ఎఫెక్ట్ పడేలేదని సమాచారం. అయితే మొదటి నుండి నాగబాబు అందరు పార్టీసిపెంట్స్ కు తలలో నాలుక వాలే వ్యవహరించి, వారికి వ్యక్తిగతంగా ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేవారని, అది ఒక్కటి మాత్రం కొంత వెలితి అని పార్టీసిపెంట్స్ లో కొందరు భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఒకరకంగా తమ షో రేటింగ్స్ విషయములో పెద్దగా తేడా లేకపోవడంతో షో నిర్వాహక బృందమైన మల్లెమాల వారు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారట. కాగా ఈ మ్యాటర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది...........!!

మరింత సమాచారం తెలుసుకోండి: