ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో ముఖ్యంగా వినపడే పేరు కాస్టింగ్ కోచ్.. ఏదోక హిరోయిన్ ఎక్కడొక్కడ ఈ సమస్యను ఎదుర్కొంది.. చాలా మంది యువతులు మోసపోతున్నారు. రాత్రి పడుకుంకుతావా, ఒక గంట పడుకుంటవా అంటూ నీచంగా మాట్లాడుతున్నారని చాలా మంది హీరోయిన్లు అటు నుండే ఒక సినిమాతోనే తట్టా బుట్ట సర్దుకున్నారు..


ఇంకా ఆ జాబితా విషయానికొస్తే.. హిరోయిన్ మంజరి కూడా సినిమాల్లో ఈ మధ్య కనిపించలేదు..తెలుగు చిత్ర పరిశ్రమలో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి మీడియాతో పంచుకుంది. ‘శక్తి’ సినిమా తర్వాత తాను సినిమాలు చేయకపోవడానికి కారణం అదేనని తెలిపింది.ఓ టాప్ నిర్మాణ సంస్థ నుంచి సినిమా వచ్చినప్పటికీ ఓ దర్శకుడు తనతో పడుకుంటే నటించే అవకాశం ఇస్తానని అన్నాడట. తన ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఆ పాడుపని చేయడానికి ఒప్పుకోలేదని, ఆ తర్వాత తెలుగు సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు.


ఇండస్ట్రీలో చాలా మంది టాలెంట్ ను నమ్ముకొని పైకొచ్చిన వాళ్లే ఉన్నారు..అయితే వారందరూ నటీమణులకు క్యాస్టింగ్ కౌచ్ అనేది ఓ శాపంలాంటిది. ఆ శాపం వల్లే మా టాలెంట్ నిరూపించుకోలేక సినిమాలకు దూరంగా ఉంటున్నాం. అందుకే మాకు స్టార్‌డం రావడంలేదు. నేను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సంఘటనల వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. దాని నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టింది. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందన్న మాట నిజమే. కానీ ఎవ్వరూ బలవంతంగా రేప్ చేయరు. ఒప్పుకోవాలా వద్దా అనేది మన ఆత్మాభిమానంపై ఆధారపడి ఉంటుంది.


నాకు ఇండస్ట్రీ నుండి చాలా అవకాశాలు వచ్చాయి కానీ, ఇక్కడ ఇంకో మాట వినపడేది.. అవకాశాలు ఇస్తారు కానీ పడుకుంటే నీకు ఇంకో ఛాన్స్ వస్తుందని చాలా మంది అన్నారు..నా 15 సినీ కెరీర్లో ఇలా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా అంటూ మంజరి అన్నారు..కానీ అవి బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యేవి. ఈ ఘటనల వల్ల చాలా కాలంగా డిప్రెషన్‌లో ఉండిపోయాను. ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ ఘటనలు చిత్ర పరిశ్రమలో చాలా ఎక్కువ. అయితే వాటిని ఒప్పుకోవాలని ఎవ్వరూ బలవంతం చేయరు. నా ఆత్మాభిమానాన్ని పోగొట్టుకోలేక ఎందరో పెద్ద నిర్మాతల సినిమాలకు నో చెప్పాను.. కొన్ని సినిమాలకు సైన్. చేశాక నో చెప్పాను అంటూ మంజరి అన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: