పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ అతి తక్కువ సమయంలోనే తెలుగులోని  అందరి సూపర్ స్టార్లతో నటించింది. మొదటి బాలీవుడ్ సినిమా యారియాన్ తో వెండితెరకు పరిచయం అయింది. కానీ, ఆ తర్వాత బాలీవుడ్ ని వదిలేసి టాలీవుడ్ కు వచ్చి సందీప్ కిషన్ తో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా తెలుగు సినిమాలో మెరిసింది. ఇక అక్కడి నుంచి ఈ అమ్మడికి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఇండస్ట్రీలోని ప్రతి పెద్ద హీరోతో నటించే అవకాశం కొట్టేసింది ఈ అమ్మడు.

 

Image

 

కానీ, అనుకున్న స్థాయిలో అన్ని సినిమాలు కూడా ఆడకపోవడంతో, కొన్ని రోజులు తర్వాత తన దృష్టిని కోలీవుడ్ ఇండస్ట్రీకి మార్చింది. అక్కడ కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తిరిగి మళ్లీ బాలీవుడ్ వైపు వెళ్ళింది అక్కడ అజయ్ దేవగన్ తో నటించిన దే దే ప్యార్ దే సినిమా మంచి విజయం సాధించింది. కానీ, ఆ తర్వాత అవకాశాలు రావట్లేదు ఈ అమ్మడుకు. 

 

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని బాగా పాటిస్తుంది హీరోయిన్ గా లైం లైట్ లో ఉన్నప్పుడే మరో బిజినెస్ కూడా సెట్ చేసుకుంటుంది ఈ అమ్మడు. మెట్రో సిటీస్ లో ఎఫ్ 45 పేరుతో జిమ్ బిజినెస్ ప్రారంభించింది. తనదైన శైలి ప్రచారంతో ఈ బిజినెస్ ని సూపర్ సక్సెస్ చేసుకుంది.

 

Image

 

ఇక ఈమె ఫోటోషూట్లో గురించి చెప్పనక్కర్లేదు అప్పుడప్పుడు అదిరిపోయే స్టిల్స్ తో కుర్రకారుకి నిద్రలేకుండా చేసింది. ఈ పంజాబీ ముద్దుగుమ్మ తాజాగా ఎఫ్.హెచ్.ఎం మ్యాగజైన్ కవర్ పేజీపై అదిరిపోయే ఫోజుతో చెలరేగింది.బ్లాక్ డిజైన్ డ్రెస్ ధరించింది. దానిపై ఓ బ్లూ కోట్ తో ఇచ్చిన కవరింగ్ చూడగానే.. రకుల్ నెవ్వర్ బిఫోర్ అన్నంత హాట్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు కమలహాసన్ తో శంకర్ నిర్మిస్తున్న భారతీయుడు సినిమా 2 లో నటిస్తుంది. అలాగే తమిళ హీరో శివ కార్తికేయన్ సినిమాలో కూడా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: